ODI World Cup 2023 PAK VS AFG : వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై అఫ్గానిస్థాన్ సంచలన విజయం సాధించింది. 283 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్థాన్.. రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 49 ఓవర్లలో 286 పరుగులు చేసింది. 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఓపెనర్లు రెహ్మానుల్లా గుర్బాజ్(53 బంతుల్లో 65; 9x4, 1x6), ఇబ్రహీం జాద్రమ్(113 బంతుల్లో 87; 10x4), రెహ్మత్ షా(77 నాటౌట్ ), హస్మతుల్లా షాహిది(48 నాటౌట్) చెలరేగి ఆడారు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రీది, హసీన్ అలీ తలో వికెట్ తీశారు.
ఈ ఓటమితో పాకిస్థాన్ జట్టు వరుసగా మూడో పరాజయాన్ని ఖాతాలో వేసుకుంది. టీమ్ఇండియాతో మ్యాచ్ తర్వాత ఆస్ట్రేలియాపై ఓడిన పాకిస్థాన్, తాజాగా ఇప్పుడు పసికూన అఫ్గాన్ చేతుల్లో చిత్తుగా ఓడి పరువు పోగొట్టుకుంది. సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. పాక్ వరల్డ్ క్లాస్ బౌలింగ్ అటాక్‌ను అఫ్గాన్ బ్యాటర్లు సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. పాకిస్థాన్‌పై అఫ్గాన్‌కు ఇదే తొలి వన్డే విజయం కావడం విశేషం.
ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి వికెట్‌కు 114 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన ఇబ్రహీం జాద్రామ్, రెహ్మానుల్లా గుర్భాజ్.. ఇప్పుడు పాకిస్థాన్‌పై ఏకంగా 130 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. 53 బంతుల్లో 9 ఫోర్లు, ఓ సిక్సర్‌తో సాయంతో 65 పరుగులు చేసిన రెహ్మనుల్లా, షాహీన్ ఆఫ్రిదీ బౌలింగ్‌లో ఔట్ కాగా.. ఇబ్రహీం జాద్రామ్.. రెహ్మత్ షాతో కలిసి రెండో వికెట్‌కు 60 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. 113 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 87 పరుగులు చేసిన ఇబ్రహీం... హసన్ ఆలీ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.
ఆ తర్వాత రెహ్మత్ షా, హస్మతుల్లా షాహిదీ కలిసి మూడో వికెట్‌కు అజేయంగా 96 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్‌ను ఘనంగా ముగించారు. 84 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 77 పరుగులు చేసిన రెహ్మత్ షా, 45 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 48 పరుగులు చేసిన హస్ముతల్లా షాహిది.. పాకిస్థాన్ జట్టుకు ఊహించని షాక్ ఇచ్చారు.
-
𝐇𝐢𝐬𝐭𝐨𝐫𝐲 𝐂𝐫𝐞𝐚𝐭𝐞𝐝 𝐢𝐧 𝐂𝐡𝐞𝐧𝐧𝐚𝐢! 🙌
— Afghanistan Cricket Board (@ACBofficials) October 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Congratulations to AfghanAtalan and the whole Afghan Nation for this marvelous victory over @TheRealPCB on the biggest stage of the world. 🤩👏#AfghanAtalan | #CWC23 | #AFGvPAK | #WarzaMaidanGata pic.twitter.com/nAP5VvTnSY
">𝐇𝐢𝐬𝐭𝐨𝐫𝐲 𝐂𝐫𝐞𝐚𝐭𝐞𝐝 𝐢𝐧 𝐂𝐡𝐞𝐧𝐧𝐚𝐢! 🙌
— Afghanistan Cricket Board (@ACBofficials) October 23, 2023
Congratulations to AfghanAtalan and the whole Afghan Nation for this marvelous victory over @TheRealPCB on the biggest stage of the world. 🤩👏#AfghanAtalan | #CWC23 | #AFGvPAK | #WarzaMaidanGata pic.twitter.com/nAP5VvTnSY𝐇𝐢𝐬𝐭𝐨𝐫𝐲 𝐂𝐫𝐞𝐚𝐭𝐞𝐝 𝐢𝐧 𝐂𝐡𝐞𝐧𝐧𝐚𝐢! 🙌
— Afghanistan Cricket Board (@ACBofficials) October 23, 2023
Congratulations to AfghanAtalan and the whole Afghan Nation for this marvelous victory over @TheRealPCB on the biggest stage of the world. 🤩👏#AfghanAtalan | #CWC23 | #AFGvPAK | #WarzaMaidanGata pic.twitter.com/nAP5VvTnSY
అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. కెప్టెన్ బాబర్ అజామ్ ( 92 బంతుల్లో 74; 4x4, 1x6), ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ ( 75 బంతుల్లో 58; 4x4, 2x6), షాదాబ్ ఖాన్ (38 బంతుల్లో 40; 1x4, 1x6), ఇఫ్తికార్ అహ్మద్ (27 బంతుల్లో 40; 2x4, 4x6) మెరుపులు మెరిపించారు. సాద్ షకీల్ (25), ఇమామ్ ఉల్ హక్ (17), మహ్మద్ రిజ్వాన్ (8) తక్కువ స్కోరుకు వెనుదిరిగారు. అఫ్గాన్ బౌలర్లలో నూర్ అహ్మద్ 3 వికెట్లు తీయగా.. నవీనుల్ హక్ 2 వికెట్లు పడగొట్టాడు. అజ్మతుల్లా ఒమర్‌జాయ్, మహ్మద్ నబీ తలో వికెట్ తీశారు.
Virat Kohli Centuries : జస్ట్ మిస్.. కోహ్లీ సెంచరీలు చేజార్చుకున్న సందర్భాలు ఎన్నో తెలుసా?