ETV Bharat / sports

ODI World Cup 2023 : ప్రపంచకప్​లో సంచలనాలు.. మొన్న అఫ్గాన్, నిన్న 'డచ్​'.. వీరితో జాగ్రత్త బాసూ! - దక్షిణాఫ్రికా నెదర్లాండ్ మ్యాచ్​

ODI World Cup 2023 Netherlands : 2023 ప్రపంచకప్​లో చిన్న చిన్న దేశాలు, మేటి జట్లకు సైతం షాకిస్తున్నాయి. ఇటీవల అఫ్గాన్ సంచలన విజయం నమోదు చేయాగా.. తాజాగా నెదర్లాండ్స్ జట్టు దక్షిణాఫ్రికాపై గెలుపొందింది.

ODI World Cup 2023 Netherlands
ODI World Cup 2023 Netherlands
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 18, 2023, 3:31 PM IST

Updated : Oct 18, 2023, 3:57 PM IST

ODI World Cup 2023 Netherlands : క్రికెట్​లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు అనేదానికి ప్రస్తుత ప్రపంచకప్.. సరైన ఉదాహరణ. ఈ మెగాటోర్నీలో ఇటీవల డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్​కు.. అఫ్గానిస్థాన్ షాకిచ్చిన మ్యాచ్ మరువక ముందే.. తాజాగా నెదర్లాండ్స్​ జట్టు దక్షిణాఫ్రికాను బెంబేలెత్తించింది. తమను చిన్న జట్లే కదా అని తక్కువ అంచనా వేస్తే.. ఎలాంటి పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందో కళ్లారా చూపించాయి ఈ జట్లు.

అయితే నెదర్లాండ్స్‌ ఒకప్పుడు ప్రపంచకప్‌లో మ్యాచ్‌లు ఆడుతుంటే.. పెద్ద జట్లు ప్రాక్టీస్​ చేసుకోవడాని, రికార్డులు నమోదు చేయడానికి మాత్రమే అన్నట్లు చూసేవారు. కానీ, ఇప్పుడు ఈ జట్టును ఏమాత్రం తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. ప్రపంచవ్యాప్తంగా అనేక టీ20 లీగ్స్‌లో ఆడుతూ ఆ జట్టు ఆటగాళ్లు రాటుదేలిపోయారు. అలానే వేరే దేశాల నుంచి తెచ్చుకున్న కొందరు ప్రతిభావంతుల వల్ల నెదర్లాండ్స్‌ బలం పెరిగి.. ప్రస్తుతం ఆ జట్టు ప్రమాదకరంగా మారింది.

డచ్‌ జట్టు ఎంత ప్రమాదకరమో దక్షిణాఫ్రికాకు ఇదివరకే తెలుసు. గతేడాది టీ20 ప్రపంచకప్‌ గ్రూప్‌ దశలో సఫారీ జట్టు, నెదర్లాండ్స్‌ చేతిలో ఓటమి పాలైంది. నెదర్లాండ్స్​ నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక దక్షిణాఫ్రికా.. 145/8 కు పరిమితమైంది. ఇకపోతే కొన్ని నెలల కిందట జరిగిన ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌లోనూ నెదర్లాండ్స్​.. వెస్టిండీస్‌కు పెద్ద ఝలక్​ ఇచ్చింది. 375 పరుగుల భారీ ఛేదనలో దిగిన నెదర్లాండ్స్​.. స్కోరును సమం చేసి ఇన్నింగ్స్​ను డ్రాగా ముగించింది. అనంతరం సూపర్‌ ఓవర్​లో విండీస్​పై గెలిచి సంచలనం సృష్టించింది నెదర్లాండ్స్‌. ఆ మ్యాచ్‌లో తెలుగు కుర్రాడు తేజ నిడమానూరు (111) సంచలన శతకంతో అదరగొట్టాడు.

ఇప్పుడు మెగాటోర్నీలో.. తనకంటే ఎంతో మెరుగైన, ఇప్పటికే రెండు ఘన విజయాలతో ఊపుమీదున్న దక్షిణాఫ్రికాపై ఆల్​రౌండ్ ప్రదర్శనతో పైచేయి సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. మొదట బ్యాటింగ్‌లో పీకల్లోతు కష్టాల్లో పడి.. ఆపై పుంజుకుని మెరుగైన స్కోరు సాధించిన నెదర్లాండ్స్​.. అనంతరం బౌలింగ్‌లోనూ ఆరంభం నుంచే పట్టుబిగించింది. దీంతో అద్భుతమైన విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అందుకే దీన్ని గాలివాటం విజయంగా చూడలేం. ఇకపై ప్రత్యర్థులు.. డచ్​ జట్టుతో తలపడాలంటే జాగ్రత్తగా ఉండాల్సిందే. ప్రస్తుతం నెదర్లాండ్స్‌ జట్టులో కీలక ఆటగాళ్లయిన వాండర్‌మెర్వ్‌, ఆకర్‌మ్యాన్‌ దక్షిణాఫ్రికా దేశస్థులే కావడం విశేషం. వాండర్‌మెర్వ్‌ ఒకప్పుడు దక్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించాడు కూడా. ఆకర్‌మ్యాన్‌ అండర్‌-19లో సఫారీ జట్టుకు ఆడాడు.

South Africa vs Netherlands World Cup 2023 : ప్రపంచకప్​లో మరో సంచలనం.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన నెదర్లాండ్స్

ODI World Cup 2023 Semi Final : సెమీస్​ రేస్​.. లెక్క తప్పింది సార్​.. వేడి రాజుకుంది!

Last Updated : Oct 18, 2023, 3:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.