ODI World Cup 2023 Mitchell Starc Record : 2023 ప్రపంచ కప్‌లో వివిధ జట్లకు చెందిన ప్లేయర్లు ఏదోక విషయంలో రికార్డులు సృష్టిస్తున్నారు. తాజాగా శుక్రవారం ఆస్ట్రేలియా పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ ప్లేయర్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. వరల్డ్ కప్ టోర్నీలో పాకిస్థాన్ మాజీ ప్లేయర్ పేస్ బౌలర్ వసీమ్ అక్రమ్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. ఇప్పటి వరకు జరిగిన ప్రపంచ కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్లలో నాలుగో స్థానంలో నిలిచాడు. అతనెవరో కాదు ఆసీస్ ఆటగాడు మిచెల్ స్టార్క్.
బెంగళూరు వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టార్క్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. 8 ఓవర్ల బౌలింగ్‌లో ఏకంగా 65 పరుగులు ఇచ్చి.. ఒక్క వికెట్ మాత్రమే తీయగలిగాడు. తీసింది ఒక వికెట్ అయిన అరుదైన రికార్డును సాధించాడు. ఇప్పటి వరకు జరిగిన ప్రపంచకప్‌లో మొత్తం 22 మ్యాచ్‌ల్లో 55 వికెట్లు తీశాడు. దీంతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో నాలుగో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ క్రమంలో పాకిస్థాన్ ప్లేయర్ వసీమ్ అక్రమ్ పేరిట ఉన్న రికార్డును స్టార్క్ సమం చేశాడు. అయితే వసీమ్ అక్రమ్ మొత్తం 38 మ్యాచ్‌ల్లో 55 వికెట్లు తీస్తే.. స్టార్క్ మాత్రం ఆ ఘనతను 22 మ్యాచ్‌ల్లో సాధించాడు. అలా ఈ ఘనత సాధించిన రెండో ఆసీస్ బౌలర్‌గా చరిత్రకెక్కాడు.
World cup Highest wickets : మరోవైపు వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన టాప్ బౌలర్లు.. ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్ మెగ్రాత్ మొదటి స్థానంలో నిలిచాడు. 39 మ్యాచ్‌ల్లో 71 వికెట్లు తీశాడు. శ్రీలంక ఆటగాడు ముత్తయ్య మురళీధరన్ 40 మ్యాచ్‌ల్లో 68 వికెట్లు తీసి రెండో స్థానంలో నిలిచాడు. మరో శ్రీలంక ఆటగాడు లసిత్ మలింగ 29 మ్యాచ్‌ల్లో 56 వికెట్లు పడగొట్టి మూడో స్థానంలో ఉన్నాడు. తరువాత స్థానంలో 55 వికెట్లతో మిచెల్ స్టార్క్, వసీమ్ అక్రమ్ ఉన్నారు.
పాకిస్థాన్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌లో 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి ఆసీస్ 367 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో పాక్ 305 పరుగులకే ఓటమిపాలైంది. 62 పరుగుల తేడాతో అస్ట్రేలియా ఘన విజయం సాధించింది.
-
Australia overcome the Pakistan challenge in Bengaluru to make it two in two at #CWC23 👊#AUSvPAK 📝: https://t.co/wMEoG5pZFB pic.twitter.com/wdbshJj2eu
— ICC Cricket World Cup (@cricketworldcup) October 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Australia overcome the Pakistan challenge in Bengaluru to make it two in two at #CWC23 👊#AUSvPAK 📝: https://t.co/wMEoG5pZFB pic.twitter.com/wdbshJj2eu
— ICC Cricket World Cup (@cricketworldcup) October 20, 2023Australia overcome the Pakistan challenge in Bengaluru to make it two in two at #CWC23 👊#AUSvPAK 📝: https://t.co/wMEoG5pZFB pic.twitter.com/wdbshJj2eu
— ICC Cricket World Cup (@cricketworldcup) October 20, 2023
World Cup 2023 Pak Vs Aus : పాక్‌కు షాక్.. ఆసీస్ ఘన విజయం
Aus vs Pak World Cup 2023 : వార్నర్ ఇన్నింగ్స్ 'తగ్గేదేలే'.. పాకిస్థాన్ ముందు కొండంత లక్ష్యం