ODI World Cup 2023 IND vs ENG : 2023 ప్రపంచకప్‌లో భారత్ హవా కొనసాగుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతోంది. తొలుత బ్యాటింగ్ విభాగానికి ఎదురైన పరీక్షలో దిగ్విజయంగా సఫలీకృతం కావటం.. ఇప్పుడు బౌలింగ్‌లోనూ అద్భుతంగా రాణిస్తోంది. ఒక్కో సవాల్‌ను అధిగమిస్తూ.. టైటిల్‌ను కైవసం చేసుకునే దిశగా టీమ్ఇండియా పయనం సాగుతోంది. అయితే ఆడిన ఆరు మ్యాచుల్లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్ భారత్‌కు ఎంతో ప్రత్యేకం. ఇంగ్లాండ్‌పై ఆషామాషీగా వచ్చిన గెలుపు కాదు ఇది. టీమ్ఇండియా బౌలింగ్ సత్తాను ప్రపంచానికి చాటిచెప్పిన మ్యాచ్.
-
WIN by 💯 runs in Lucknow ✅
— BCCI (@BCCI) October 29, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
🔝 of the table with 6⃣ wins in a row!#TeamIndia 🇮🇳#CWC23 | #MenInBlue | #INDvENG pic.twitter.com/oKmCLpCzUt
">WIN by 💯 runs in Lucknow ✅
— BCCI (@BCCI) October 29, 2023
🔝 of the table with 6⃣ wins in a row!#TeamIndia 🇮🇳#CWC23 | #MenInBlue | #INDvENG pic.twitter.com/oKmCLpCzUtWIN by 💯 runs in Lucknow ✅
— BCCI (@BCCI) October 29, 2023
🔝 of the table with 6⃣ wins in a row!#TeamIndia 🇮🇳#CWC23 | #MenInBlue | #INDvENG pic.twitter.com/oKmCLpCzUt
అది అంత సులువు కాదు.. టీమ్ఇండియా గెలిచింది అని ఇంగ్లాండ్‌తో మ్యాచ్ స్పెషల్ అంటున్నారని అనుకోవద్దు. ఎందుకంటే ఇంగ్లాండ్ జట్టులో స్టార్ బ్యాటర్లే ఉన్నారు. బ్యాటర్లను పెవిలియన్‌కు పంపిచటం సులువైన విషయం కాదు. దానికి ఎంతో నిబద్ధత, బౌలింగ్‌లో క్రమశిక్షణ అవసరం. అదేంటనేది భారత్ ఆడిన గత ఐదు మ్యాచులను.. ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లను చూస్తే అర్థమైపోతుంది. ఆ ఐదు మ్యాచ్‌ల్లో మొదట టీమ్ఇండియా బౌలింగ్ చేసింది. పిచ్, వాతావరణ పరిస్థితులను సద్వినియోగం చేసుకుని ఆయా మ్యాచ్‌ల్లో ప్రత్యర్థులను కట్టడి చేసింది. అలానే బ్యాటర్లు చెలరేగి విజయాలను అందించారు. కానీ, ఇంగ్లాండ్‌తో మాత్రం ఛేదన సమయంలో బౌలింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
ఇకపోతే ఇంగ్లాండ్‌కు నిర్దేశించిన లక్ష్యం కూడా భారీగా లేదు. టార్గెట్ 230 పరుగులు మాత్రమే. అప్పటికే వరుసగా ఓటములను చవిచూస్తున్న ఇంగ్లాండ్ చెలరేగిపోతుందని అంతా అనుకున్నారు. ఎందుకంటే జట్టులో స్టార్ బ్యాటర్లు ఉన్నారు. దానికి తోడు తేమ ప్రభావం అధికంగా ఉండే పిచ్ కావటం వల్ల అనేక అనుమానాలు వచ్చాయి. కానీ, భారత్ బౌలింగ్ విభాగం లైన్ అండ్ లెంగ్త్‌కు కట్టుబడి మరీ బంతిని సంధించడం వల్ల ఇంగ్లాండ్ బ్యాటర్లు ఏ మాత్రం నిలవలేకపోయారు. దీంతో 129 పరుగులకే ఆలౌట్ అవ్వటం విశేషం. ఇక గతేడాది జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌ను.. ఇంగ్లాండ్ పది వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఇప్పుడు ఆ ఓటమికి టీమ్ఇండియా ప్రతీకారం తీర్చుకున్నట్లైంది.
-
A signature Bumrah YORKER to wrap things up in Lucknow! 🤩
— BCCI (@BCCI) October 29, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Scorecard ▶️ https://t.co/etXYwuCQKP#TeamIndia | #CWC23 | #MenInBlue | #INDvENG pic.twitter.com/bIB98hVnFz
">A signature Bumrah YORKER to wrap things up in Lucknow! 🤩
— BCCI (@BCCI) October 29, 2023
Scorecard ▶️ https://t.co/etXYwuCQKP#TeamIndia | #CWC23 | #MenInBlue | #INDvENG pic.twitter.com/bIB98hVnFzA signature Bumrah YORKER to wrap things up in Lucknow! 🤩
— BCCI (@BCCI) October 29, 2023
Scorecard ▶️ https://t.co/etXYwuCQKP#TeamIndia | #CWC23 | #MenInBlue | #INDvENG pic.twitter.com/bIB98hVnFz
అద్భుతమై బౌలింగ్.. భారత బౌలర్ల బంతులకు ఇంగ్లాండ్ బ్యాటర్లు బెంబేలెత్తిపోయారు. ముందుగా బుమ్రా వికెట్లు పడగొట్టి బ్యాటర్లకు ఒత్తిడి పెంచాడు. తర్వాత షమీ వచ్చాక ఇంగ్లాండ్ పతనం వేగంగా సాగింది. అతడి బౌలింగ్‌ను ఆడేందుకు ప్రత్యర్థి బ్యాటర్లు తీవ్రంగా శ్రమించారు. ఆరుగురు బ్యాటర్లు బౌల్డ్ కావడం, ఇద్దరు ఎల్బీ, ఒక క్యాచ్, ఒక స్టంపౌట్ అయ్యారంటే భారత బౌలింగ్ పదును ఎంత అద్భుతంగా ఉందో తెలిసిపోతుంది. స్టంప్స్‌ను మాత్రమే లక్ష్యంగా చేసుకుని బౌలింగ్‌తో దాడి చేశారు. మొత్తం 10 వికెట్లలో ఏడు పేసర్లు తీయగా.. మూడు స్పిన్నర్లుకు దక్కాయి. కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ స్పెల్‌లో మార్పులు చేయటం కూడా టీమ్ఇండియాకు కలిసొచ్చింది.
షమీ, బుమ్రా, కుల్‌దీప్, జడేజా కీలక సమయాల్లో వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ను దెబ్బ కొట్టారు. మరీ ముఖ్యంగా షమీ వేసిన బంతిని అంచనా వేయడంలో బెన్ స్టోక్స్ ఘోరంగా విఫలమై క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. అలాగే డేవిడ్ మలన్‌ను బుమ్రా బౌల్డ్ చేసిన తీరు అభినందనీయం. అయితే, వన్డే ప్రపంచకప్‌లోనే అత్యంత అద్భుతమైన డెలివరీ సంధించిన బౌలర్‌గా మాత్రం కుల్‌దీప్ నిలిచిపోతాడు. ఆఫ్ వికెట్‌కు ఆవల వేసిన బంతి అద్భుతమైన టర్నింగ్‌తో వికెట్లను గిరాటేయటం వల్ల ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ అలానే చూస్తుండిపోయాడు. 2019 వరల్డ్ కప్‌లో బాబర్ అజామ్‌ను ఇలానే సూపర్ డెలివరీతో కుల్‌దీప్ బౌల్డ్ చేసిన సంఘటనను ఇది గుర్తుకు తెచ్చింది.
సత్తా చాటిన షమి.. ప్రపంచ కప్ టోర్నీ ప్రారంభానికి ముందు స్పిన్నర్లు కీలక పాత్ర పోషిస్తారని అంతా భావించారు. దీంతో ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లతోనే బరిలోకి దిగితే మంచిదనే సూచనలు వచ్చాయి. కానీ, పేసర్లు కూడా తామేం తక్కువ కాదంటూ సత్తా చాటారు. బుమ్రా ఆరంభంలోనే వికెట్లు తీస్తూ భారత శిబిరంలో ఉత్సాహం నింపాడు. పాక్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి జట్లపైనా బుమ్రా శుభారంభం అందిస్తే మిగతా బౌలర్లు చెలరేగిపోయారు. ఎప్పుడైతే షమీ కూడా జట్టుతో చేరాడో పేస్ విభాగం మరింత పదునెక్కింది. ఈ వరల్డ్ కప్‌లో తొలిసారి కివీస్‌పై ఆడిన షమీ ఐదు వికెట్ల ప్రదర్శన చేసి అబ్బురపరిచాడు. ఇక ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లోనూ ప్రతి బంతికీ వికెట్ తీసేలా అనిపించింది. లైన్ అండ్ లెంగ్త్‌కు కట్టుబడి వికెట్లనే లక్ష్యంగా చేసుకుని బౌలింగ్ చేశాడు.
వన్డే ప్రపంచకప్‌ను నెగ్గాలంటే ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులను సమర్థంగా ఎదుర్కోవాలి. ప్రస్తుతం భారత బౌలింగ్ విభాగాన్ని చూస్తుంటే మిగతా జట్ల కంటే పటిష్ఠంగానే ఉందానే చెప్పాలి. మిగిలిన మూడు మ్యాచ్‌లతోపాటు నాకౌట్ దశలో ఏమాత్రం పట్టువిడవకుండా తలపడాలి. ఇదే నిలకడైన ఆటతీరును చివరి వరకూ కొనసాగిస్తే కప్‌ను సొంతం చేసుకొవచ్చు.
ODI World Cup 2023 : సెమీస్ రేస్.. రెండు జట్ల లెక్క తేలిపోయింది!