ODI World Cup 2023 IND VS ENG : వన్డే ప్రపంచకప్ - 2023లో టీమ్ఇండియా వరుస విజయాలతో దూసుకెళ్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ మెగాటోర్నీ తొలి మ్యాచ్‌తోనే బెస్ట్ ఫీల్డర్ మెడల్స్‌ను అందిస్తోంది టీమ్ ఇండియా మేనేజ్మెంట్. డ్రెస్సింగ్ రూమ్‌ను మరింత ఉత్సాహంగా మారుస్తూ.. మైదానంలో అత్యుత్తమ ఫీల్డింగ్ చేసిన ప్లేయర్స్.. పతకాలను అందిస్తోంది.
ఇప్పటికే విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఈ మెడల్స్‌ను ముద్దాడారు. తాజాగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఈ మెడల్ ఓ ప్లేయర్‌కు వరించింది. ఈ సందర్భంగా ఫీల్డింగ్ కోచ్ దిలీప్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కేవలం గణాంకాలను చూసి మాత్రమే కాకుండా.. మైదానంలో వ్యవహరించిన తీరును చూసి కూడా బెస్ట్ ఫీల్డర్ ఎవరనేది అనౌన్స్ చేస్తున్నట్లు తెలిపారు.
ఇంగ్లాండ్ మ్యాచ్ సందర్భంగా ముగ్గురి మధ్య తీవ్ర పోటీ ఎదురైందని.. కానీ చివరికి ఒకరిని సెలెక్ట్ చేసినట్లు అనౌన్స్ చేశారు. కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, మహ్మద్ సిరాజ్ మధ్య తీవ్రంగా పోటీ పడ్డారని చెప్పిన ఆయన.. చివరకు రాహుల్ బెస్ట్ ఫీల్డర్ మెడల్‌ను సొంతం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
"ఈ పతకం అనేది కేవలం గణాంకాలను మాత్రమే పరిగణలోకి తీసుకుని ఇవ్వట్లేదు. మైదానంలో ఏ ప్లేయర్ ఎంత మేర ప్రభావం చూపించారు, స్ఫూర్తిని తీసుకువచ్చారనేది పరిగణలోకి తీసుకుని ఇస్తున్నాం. వారినే విజేతలుగా ప్రకటిస్తున్నాం. అలాంటి వారిలో... ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ మంచి ప్రదర్శన చేసి ప్రభావితం చూపాడు. అతడే ఈసారి బెస్ట్ ఫీల్డర్ విన్నర్. బౌండరీ లైన్ వద్ద కొన్ని క్యాచ్‌లను మిస్ చేసినప్పటికీ.. సిరాజ్ శ్రమించిన తీరు కూడా బాగుంది. ఇషాన్ కిషన్ కూడా మైదానంలో చురుగ్గానే ఉన్నాడు" అని దిలీప్ వెల్లడించారు. దీంతో ఈ ప్రతిష్టాత్మ మెగా టోర్నీలో రెండో సారి ఈ బెస్ట్ ఫీల్డర్ మెడల్ కేఎల్ రాహుల్‌కు దక్కింది. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ అతడు ఈ పతకాన్ని ముద్దాడాడు.
-
LIGHTS OUT in Lucknow 🏟️
— BCCI (@BCCI) October 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
This Post-match medal ceremony was LIT(erally) Bigger & Brighter 🔆
Presenting a visual spectacle 🤩#TeamIndia | #INDvENG | #CWC23 | #MenInBlue
WATCH 🎥🔽 - By @28anand
">LIGHTS OUT in Lucknow 🏟️
— BCCI (@BCCI) October 30, 2023
This Post-match medal ceremony was LIT(erally) Bigger & Brighter 🔆
Presenting a visual spectacle 🤩#TeamIndia | #INDvENG | #CWC23 | #MenInBlue
WATCH 🎥🔽 - By @28anandLIGHTS OUT in Lucknow 🏟️
— BCCI (@BCCI) October 30, 2023
This Post-match medal ceremony was LIT(erally) Bigger & Brighter 🔆
Presenting a visual spectacle 🤩#TeamIndia | #INDvENG | #CWC23 | #MenInBlue
WATCH 🎥🔽 - By @28anand
ODI World Cup 2023 Rohith Sharma : 'కఠిన పరీక్ష పెట్టిన మ్యాచ్ ఇది.. వాళ్లు అద్భుతం చేశారు'