Nz vs Pak World Cup 2023 : 2023 వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్.. న్యూజిలాండ్‌పై డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 21 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 401 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ జెట్ స్పీడ్‌తో పరుగులు సాధించింది. ఫకర్ జమాన్ (126* పరుగులు, 81 బంతుల్లో; 8x4, 11x6), బాబర్ అజామ్ (66* 63 బంతుల్లో; 6x4, 2x6) మెరుపులకు కొండంత లక్ష్యం కరిగిపోతూ వచ్చింది. ఇక మ్యాచ్ మధ్యలో వర్షం పలుమార్లు అంతరాయం కలిగించింది.
దీంతో తొలుత పాక్ లక్ష్యాన్ని 41 ఓవర్లకు 341కు కుదించారు. కాసేపటికి ఆట ప్రారంభమయ్యాక 25.3 ఓవర్ల వద్ద మరోసారి వర్షం వచ్చింది. అప్పటికి పాక్ 200-1తో నిలిచింది. అయితే డక్‌వర్త్ లూయిస్ ప్రకారం 25.3 ఓవర్లకు 179 పరుగులు చేస్తే చాలు. కానీ, పాక్ అంతకంటే ఎక్కువే చేయడం వల్ల పాకిస్థాన్ విజేతగా నిలిచింది. సౌథీ ఒక వికెట్ పడగొట్టాడు. సూపర్ సెంచరీతో అదరగొట్టిన ఫకర్ జమాన్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన కివీస్ బ్యాటర్లు కూడా ఆశకామే హద్దుగా చెలరేగిపోయారు. ముఖ్యంగా యంగ్ బ్యాటర్ రచిన్ రవీంద్ర (108) సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ విలియమ్సన్ (95) త్రుటిలో శతకం చేజార్చుకున్నాడు. ఓపెనర్ డేవన్ కాన్వే (35), చాప్మన్ (39), గ్లెన్ ఫిలిప్స్ (41) రాణించారు. పాక్ బౌలర్లలో మహ్మద్ వసీమ్ జాఫర్ 3, హారిస్ రౌఫ్, ఇఫ్తికార్ అహ్మద్, హసన్ అలీ తలో వికెట్ పడగొట్టారు.
ఈ మ్యాచ్‌లో నమోదైన రికార్డులు..
- వన్డే మ్యాచ్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన పాకిస్థాన్ బ్యాటర్‌గా ఫకర్ జమాన్ (11) రికార్డు కొట్టాడు. అలాగే ఒక వరల్డ్‌కప్ సీజన్లో ఎక్కువ సిక్స్‌లు బాదిన పాక్ బ్యాటర్‌గానూ ఫకర్ (18) టాప్‌లో ఉన్నాడు.
- వరల్డ్‌కప్ ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన లిస్ట్‌లో ఫకర్ నాలుగో ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. అతడి కంటే ముందు మోర్గాన్ (17 సిక్స్‌లు), క్రిస్ గేల్ (16), మార్టిన్ గప్టిల్ (11) ముందున్నారు.
- ఈ మ్యాచ్‌లో ఫకర్ జమాన్ - బాబర్ అజామ్ 194* పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్‌కు ఏ వికెట్‌కైనా ఇదే అత్యుత్తమం. ఇదివరకు కూడా 1999లో సయీద్ అన్వర్ - వాస్తి కూడా 194 పరుగులు జోడించారు.
-
A blitz from Fakhar Zaman helped Pakistan stay ahead of New Zealand in a rain-affected encounter ✌
— ICC (@ICC) November 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
With this win, Pakistan remain in contention for a #CWC23 knockout spot.#NZvPAK pic.twitter.com/QTOvEv0pLi
">A blitz from Fakhar Zaman helped Pakistan stay ahead of New Zealand in a rain-affected encounter ✌
— ICC (@ICC) November 4, 2023
With this win, Pakistan remain in contention for a #CWC23 knockout spot.#NZvPAK pic.twitter.com/QTOvEv0pLiA blitz from Fakhar Zaman helped Pakistan stay ahead of New Zealand in a rain-affected encounter ✌
— ICC (@ICC) November 4, 2023
With this win, Pakistan remain in contention for a #CWC23 knockout spot.#NZvPAK pic.twitter.com/QTOvEv0pLi
- " class="align-text-top noRightClick twitterSection" data="">
-
Babar Azam Chat Leak : వివాదాల్లో చిక్కుకున్న బాబర్ అజామ్.. అండగా పాక్ మాజీ కెప్టెన్!
ODI World Cup 2023 : డూ ఆర్ డై మ్యాచ్.. పాపం బాబర్ అజామ్.. ఇలా జరిగిందేంటి?