ETV Bharat / sports

బెన్​ స్టోక్స్​ అరుదైన రికార్డు.. టెస్టు క్రికెట్​ చరిత్రలోనే.. - మెక్​ కల్లమ్​ టెస్టు సిక్సులు

ఇంగ్లాండ్​ టెస్టు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్​ అరుదైన రికార్డు సృష్టించాడు. ఇది వరకు న్యూజిలాండ్​ ప్లేయర్​ బ్రెండన్​ మెక్​ కల్లమ్​ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. ఆ వివరాలు..

ben stokes record sixes
బెన్​ స్టోక్స్​ రికార్డు సిక్స్​లు
author img

By

Published : Feb 18, 2023, 2:18 PM IST

Updated : Feb 18, 2023, 3:05 PM IST

ఇంగ్లాండ్​ ఆల్​ రౌండర్​, టెస్టు కెప్టెన్​ బెన్​ స్టోక్స్​ అరుదైన రికార్డు సృష్టించాడు. టెస్టు క్రికెట్​ చరిత్రలో అత్యధిక సిక్సులు బాదిన క్రికెటర్​గా నిలిచాడు. బే ఓవల్ స్టేడియం వేదికగా ఇంగ్లాండ్​, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్టులో స్టోక్స్​ ఈ ఫీట్ అందుకున్నాడు. దీంతో అంతకుముందు ఈ రికార్డు సాధించిన న్యూజిలాండ్​ మాజీ ప్లేయర్ బ్రెండన్​ మెక్​ కల్లమ్​ను అధిగమించి ఈ ఘనతను సాధించాడు. కాగా, బ్రెండన్​ మెక్​ కల్లమ్​ ప్రస్తుతం ఇంగ్లాండ్​ టెస్టు ఫార్మాట్​ హెడ్​ కోచ్ కావడం గమనార్హం. ఇకపోతే ఇప్పటి వరకు 90 టెస్టులు ఆడిన బెన్​ స్టోక్స్​ 109 సిక్సులు బాదాడు. 36 సగటుతో మొత్తం 5,652 పరుగులు చేశాడు. అందులో 12 సెంచరీలు, 28 హాఫ్​ సెంచరీలు కూడా ఉన్నాయి. ఈ టెస్టు ఫార్మాట్​లో అత్యధిక వ్యక్తిగత స్కోరు 258 పరుగులు చేశాడు బెన్ స్టోక్స్.

ఇక మెక్​ కల్లమ్​ 101 టెస్టుల్లో 107 సిక్సులు బాదాడు. 38.64 సగటుతో మొత్తంగా 6,453 పరుగులు చేశాడు. అందులో 12 సెంచరీలు ఉన్నాయి. అతడి అత్యధిక వ్యక్తిగత స్కోరు 302. ఇక మెక్​కల్లమ్​ తర్వాత స్థానాల్లో ఆడమ్​ గిల్​క్రిస్ట్(100 సిక్సులు), క్రిస్​ గేల్​ (98), జేక్స్​ కల్లిస్(97), వీరేంద్ర సెహ్వాగ్(91), బ్రియాన్​ లారా(88), క్రిస్​ కార్న్స్(87) వరుస స్థానాల్లో ఉన్నారు.

కాగా, న్యూజిలాండ్​-ఇంగ్లాండ్​ మధ్య జరగనున్న రెండు టెస్టుల సిరీస్​లో భాగంగా.. ప్రస్తుతం మొదటి టెస్టు బే ఓవల్​ స్టేడియంలో జరుగుతోంది. మూడో రోజు ఆట ముగిసేసరికి​ సమయానికి న్యూజిలాండ్​ 5 వికెట్ల నష్టానికి 63 పరుగులు చేసింది. న్యూజిలాండ్​ జట్టు విజయానికి 331 పరుగులు దూరంలో ఉంది. అయితే ఈ మ్యాచ్​లో ఇంగ్లాండ్​ రెండు ఇన్నింగ్స్​ల్లోనూ అద్భుత ప్రదర్శన చేసింది. రెండో ఇన్నింగ్స్​లో బ్రాడ్​ (7), ఆండర్సన్ (6*) తప్ప మిగతా ప్లేయర్లందరూ​ రెండంకెల స్కోరు నమోదు చేయడం విశేషం.

ఇంగ్లాండ్​ తొలి ఇన్నింగ్స్​ : 325/9 (డిక్లేర్డ్​​)

న్యూజిలాండ్​ తొలి ఇన్నింగ్స్​ : 306/10

ఇంగ్లాండ్​ రెండో ఇన్నింగ్స్ : 374/10

న్యూజిలాండ్​ రెండో ఇన్నింగ్స్​ : 63/5 (మూడో రోజు ఆట ముగిసేసరికి)

Last Updated : Feb 18, 2023, 3:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.