శ్రీలంక స్టార్ సీమర్ లసిత్ మలింగ మరోసారి సంచలనం సృష్టించాడు. వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి రెండోసారి ఈ ఘనత సాధించిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. న్యూజిలాండ్‌తో పల్లెకెలెలో జరిగిన మూడో ట్వంటీ-20 మ్యాచ్‌లో మలింగ ఈ ఘనత సాధించాడు.
మలింగ తాను వేసిన మూడో ఓవర్‌లో వరుస బంతుల్లో కోలిన్ మన్రో హమీష్ రూథర్‌ఫర్డ్, గ్రాండ్‌హోమ్, రాస్ టేలర్‌లను పెవిలియన్‌కు పంపాడు. ఈ హ్యాట్రిక్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో ఐదుసార్లు హ్యాట్రిక్ తీసిన తొలి బౌలర్‌గానూ మలింగా ప్రపంచ రికార్డు సృష్టించాడు.
టీ-20ల్లో వంద వికెట్లు పడగొట్టిన ఏకైక బౌలర్‌గానూ రికార్డులకెక్కాడు మలింగ. నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన మలింగ నాలుగు వికెట్లకు తోడు ఆరు పరుగులు మాత్రమే ఇచ్చి అత్యుత్తమ గణాంకాలు నమోదుచేశాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. తర్వాత కివీస్ 16 ఓవర్లలో 88 పరుగులకే కుప్పకూలింది.
ఇదీ చూడండి: 'స్మిత్‌ను ఔట్ చేయగల మొనగాడు అతడే'