ETV Bharat / sports

'మహిళా క్రికెట్​లో ఇలాంటి రోజు వస్తుందనుకోలేదు'

author img

By

Published : May 27, 2021, 6:03 AM IST

ఆస్ట్రేలియాతో డే/నైట్ టెస్టు మ్యాచ్​పై స్పందించింది భారత ఓపెనర్​ స్మృతి మంధాన. ఇలా గులాబి టెస్టు ఆడే రోజు వస్తుందని తాను ఊహించలేదని.. ప్రస్తుతం అది సాకారం కాబోతుందని వెల్లడించింది.

smriti mandhana, indian women cricketer
స్మృతి మంధాన, భారత మహిళా క్రికెటర్

భారత మహిళ క్రికెట్​లో డే/నైట్​ టెస్టు ఆడగల రోజు ఒకటస్తుందని తాను ఊహించలేదని చెప్పింది ఇండియా ఓపెనర్ స్మృతి మంధాన. ఆస్ట్రేలియా వేదికగా మరికొన్ని నెలల్లో జరగనున్న ఈ టెస్టు గురించి ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నట్లు తెలిపింది. ఆసీస్​ టూర్​లో భాగంగా సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 3 వరకు పెర్త్​ వేదికగా ఈ మ్యాచ్​ జరగనుంది.

"నిజంగా చెప్పాలంటే, పురుషుల డే/నైట్​ టెస్టు మ్యాచ్​ చూస్తున్నప్పుడు.. నేను కూడా ఇలాంటి అనుభూతిని పొందగలనా? అని అనుకున్నా. ఆ సమయంలో నేను అనే మాటే చాలా తప్పు. కానీ, ఆసీస్​తో డే/నైట్ టెస్టు ప్రకటించగానే, క్రేజీగా భావించా. చిన్నపిల్లలాగా ఎంజాయ్ చేశా. వావ్​, మేమందరం డే/నైట్ టెస్టు ఆడబోతున్నామని సంతోషపడ్డా."

-స్మృతి మంధాన, భారత మహిళా క్రికెటర్

2006లో ఆసీస్​తో చివరిసారి టెస్టు మ్యాచ్ ఆడింది. సెప్టెంబర్​లో జరిగేది రెండోది. వచ్చే నెలలో ఇంగ్లాండ్​తో మరో టెస్టు మ్యాచ్​ ఆడనుంది భారత్. 2014లో ఇంగ్లాండ్​తో జరిగిన మ్యాచ్​లో ఆరు వికెట్ల తేడాతో గెలిచింది భారత్. అదే ఏడాది దక్షిణాఫ్రికాతో టెస్టు మ్యాచ్​ ఆడింది ఇండియా. ఇందులో 34 పరుగుల తేడాతో విజయం సాధించింది.

"పింక్​ బాల్​ టెస్టుకు ఇంకా చాలా సమయం ఉంది. ఇప్పుడు మా దృష్టంతా వచ్చే నెల ఇంగ్లాండ్​లో జరిగే టెస్టుపైనే ఉంది. అక్కడ డ్యూక్​ బంతులతో ఆడాల్సి ఉంది. ఇంగ్లాండ్​తో చాలా ఏళ్ల తర్వాత టెస్టు మ్యాచ్​ ఆడనున్నామని తెలిసి సంతోషించా" అని మంధాన తెలిపింది.

ఇదీ చదవండి: 'ఇంగ్లాండ్​లో పరిస్థితులు కివీస్​కే అనుకూలం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.