న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో (Ind vs NZ T20) భారత్ ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నానని టీమ్ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid Coach News) చెప్పాడు. అయితే ఈ విజయం పట్ల రియాలటీలోనే ఉండాలని అన్నాడు.
ఆదివారం జరిగిన చివరిదైన మూడో టీ20లో కివీస్‌పై 73 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్ క్లీన్‌స్వీప్ చేసింది టీమ్ఇండియా. కెప్టెన్ రోహిత్ శర్మ అర్ధ శతకానికి తోడు, అక్షర్ పటేల్ మూడు వికెట్లు పడగొట్టి విజయాన్ని అందించారు.
"ఇదో మంచి విజయం. సిరీస్ మొత్తం ప్రతి ఒక్కరూ బాగా రాణించారు. మంచి ఆరంభం కూడా. అయితే మేము రియాలిటీకి దూరంగా ఉండాలనుకోవట్లేదు. కాళ్లు నేల మీద ఉంచాలనుకుంటున్నాం. న్యూజిలాండ్.. టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఆడిన మూడు రోజులకే ఆరు రోజుల్లో మూడు మ్యాచ్‌లు ఆడటం అంటే అంత సులువైన విషయం కాదు. మనం బాగానే ఆడినా.. ఈ సిరీస్ నుంచి నేర్చుకొని ముందుకు వెళ్లాలి. వచ్చే 10 నెలల పాటు సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉంది. ఆ సమయంలో మనకూ ఎత్తుపల్లాలు ఎదురవుతాయి. కుర్రాళ్లు రాణించడం మంచి విషయం."
- రాహుల్ ద్రవిడ్, టీమ్ఇండియా హెడ్ కోచ్
'ద్రవిడ్ అలాంటి వ్యాఖ్యలు చేయడు'
అయితే సిరీస్ విజయానికి ముందే ద్రవిడ్‌పై (Rahul Dravid News) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు టీమ్ఇండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir News). మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి, ద్రవిడ్‌కు మధ్య ఉన్న తేడా ఏంటో వివరించాడు.
కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli News), రవిశాస్త్రి నాయకత్వంలో టెస్టుల్లో ఏడో స్థానం నుంచి అగ్రస్థానానికి చేరుకుంది టీమ్ఇండియా. అలా వరుసగా 42 నెలల పాటు కొనసాగింది. స్వదేశంలో ఆధిపత్యం ప్రదర్శించడం సహా ఆస్ట్రేలియాలో బ్యాక్ టు బ్యాక్ సిరీస్‌లు గెలిచింది. ఈ ఏడాది ఇంగ్లాండ్‌లోనూ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండు గెలిచింది. ఫైనల్ టెస్టు వచ్చే ఏడాది వేసవిలో బర్మింగ్‌హామ్‌లో జరగనుంది.
అయితే 2018 ఇంగ్లాండ్ పర్యటనలో.. కోహ్లీ నేతృత్వంలోని జట్టే ఇప్పటి వరకు అత్యుత్తమ టెస్టు జట్టని ప్రకటించాడు శాస్త్రి. టెస్టుల్లో టీమ్ఇండియా ఎదిగిన తీరుకు (Gautam Gambhir on Ravi Shastri) శాస్త్రి బృందాన్ని ప్రశంసించిన గంభీర్.. అలాంటి బోల్డ్ ప్రకటనలు చేయకుండా ఉండాల్సిందన్నాడు. ప్రస్తుత కోచ్ ద్రవిడ్ (Gautam Gambhir Dravid) అలాంటి పని ఎన్నటికీ చేయడని భావిస్తున్నట్లు చెప్పాడు.
"మనం బాగా ఆడినప్పుడు దాని గురించి సాధారణంగా గొప్పలు చెప్పుకోం. ఇతరులు మాట్లాడితే పర్వాలేదు. 2011 ప్రపంచకప్ గెలిచినప్పుడు ఇదే అత్యుత్తమ జట్టని మేము ఎవరమూ ప్రకటించలేదు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లో గెలవడం చాలా పెద్ద ఘనత. దాని గురించి ఇతరుల్ని పొగడనీయండి. ద్రవిడ్ అలాంటి వ్యాఖ్యలు చేయడు. భారత్.. బాగా ఆడినా, ఆడకపోయినా అతడి ప్రకటనలు చాలా సంయమనంతో ఉంటాయి. వినయం చాలా ముఖ్యం. క్రికెట్ ఎప్పటికీ సాగదు. ప్లేయర్లను.. మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దడంపైనే ద్రవిడ్ దృష్టి సారిస్తాడు"
- గౌతమ్ గంభీర్, టీమ్ఇండియా మాజీ ఓపెనర్
'ప్రణాళిక ప్రకారం ఆడాం'
మ్యాచ్ అనంతరం విజయం పట్ల స్పందించాడు (Rohit Sharma News) రోహిత్ శర్మ. "మేం ఓం ప్రణాళిక ప్రకారం ఆడాం. మిడిల్ ఓవర్లలో ఇంకా మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సింది. కానీ లోయర్ ఆర్డర్.. ఇన్నింగ్స్‌ను ముగించిన తీరు సంతోషాన్నిచ్చింది. హర్షల్ చివరి రెండు మ్యాచ్‌ల్లో చక్కగా రాణించాడు. స్పిన్నర్లు సిరీస్ ఆసాంతం మెరుగైన ప్రదర్శన చేశారు. అశ్విన్, అక్షర్, చాహల్ రాణించారు. వెంకటేశ్ అయ్యర్ కూడా బాగానే బౌలింగ్ చేశాడు. అతడు మరింత ఉపయుక్తమైన బౌలర్ అవుతాడు. చాలా జట్లు లోతైన బ్యాటింగ్ లైనప్ కలిగి ఉన్నాయి. నంబర్ 8, 9 కీలక పాత్ర పోషిస్తున్నారు. హర్షల్ మంచి బ్యాటర్. దీపక్ బ్యాటింగ్ సామర్థ్యాన్ని శ్రీలంకలో చూశాం" అని రోహిత్ అన్నాడు.
ఇవీ చూడండి:
కివీస్‌పై టీమ్ఇండియా విక్టరీ.. సిరీస్ క్లీన్‌స్వీప్
IND vs NZ: 'ద్రవిడ్, రోహిత్ అర్థమవ్వాలంటే కాస్త వేచిచూడాలి'