Ned vs Afg World Cup 2023 : 2023 ప్రపంచకప్‌లో సంచలన విజయాలు నమోదు చేసిన నెదర్లాండ్స్ - అఫ్గానిస్థాన్ జట్లు లఖ్‌నవూ వేదికగా శుక్రవారం తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ నిర్దేశించిన 180 పరుగుల టార్గెట్‌ను.. అఫ్గానిస్థాన్ 3 వికెట్లు కోల్పోయి 31.3 ఓవర్లలో ఛేదించింది. స్వల్ప లక్ష్య ఛేదనలో బ్యాటర్లు రహ్మత్ షా (52 పరుగులు), కెప్టెన్ హశ్మతుల్లా షాహిదీ (56*పరుగులు) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. అజ్మతుల్లా ఓమర్జాయ్ (31*) రాణించాడు. నెదర్లాండ్స్ బౌలర్లలో లోగన్ వాన్ బిక్, రియోల్ఫ్ వెండర్మెర్వ్, జుల్ఫికర్ తలో వికెట్ దక్కించుకున్నారు. మూడు వికెట్లతో రాణించిన అఫ్గాన్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీకి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు' లభించింది. ఇక ఈ గెలుపుతో అఫ్గాన్.. మెగాటోర్నీలో నాలుగో విజయాన్ని నమోదు చేసింది. దీంతో 8 పాయింట్లతో పట్టికలో ఐదో స్థానానికి చేరుకుంది.
-
𝐎𝐯𝐞𝐫𝐬: 9️⃣.3️⃣
— Afghanistan Cricket Board (@ACBofficials) November 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
𝐃𝐨𝐭𝐬: 3️⃣9️⃣
𝐑𝐮𝐧𝐬: 2️⃣8️⃣
𝐖𝐢𝐜𝐤𝐞𝐭𝐬: 3️⃣
𝐄𝐑: 2️⃣.9️⃣4️⃣
Impressive bowling display from the President @MohammadNabi007 which bags him the PoTM award against the @KNCBcricket. 👏 #AfghanAtalan | #CWC23 | #AFGvNED| #WarzaMaidanGata pic.twitter.com/opv9IIEqpf
">𝐎𝐯𝐞𝐫𝐬: 9️⃣.3️⃣
— Afghanistan Cricket Board (@ACBofficials) November 3, 2023
𝐃𝐨𝐭𝐬: 3️⃣9️⃣
𝐑𝐮𝐧𝐬: 2️⃣8️⃣
𝐖𝐢𝐜𝐤𝐞𝐭𝐬: 3️⃣
𝐄𝐑: 2️⃣.9️⃣4️⃣
Impressive bowling display from the President @MohammadNabi007 which bags him the PoTM award against the @KNCBcricket. 👏 #AfghanAtalan | #CWC23 | #AFGvNED| #WarzaMaidanGata pic.twitter.com/opv9IIEqpf𝐎𝐯𝐞𝐫𝐬: 9️⃣.3️⃣
— Afghanistan Cricket Board (@ACBofficials) November 3, 2023
𝐃𝐨𝐭𝐬: 3️⃣9️⃣
𝐑𝐮𝐧𝐬: 2️⃣8️⃣
𝐖𝐢𝐜𝐤𝐞𝐭𝐬: 3️⃣
𝐄𝐑: 2️⃣.9️⃣4️⃣
Impressive bowling display from the President @MohammadNabi007 which bags him the PoTM award against the @KNCBcricket. 👏 #AfghanAtalan | #CWC23 | #AFGvNED| #WarzaMaidanGata pic.twitter.com/opv9IIEqpf
స్వల్ప లక్ష్య ఛేదనలో అఫ్గాన్ నిలకడగానే ఆడింది. ఓపెనర్లు రహ్మానుల్లా గుర్భాజ్ (10), ఇబ్రహీమ్ జర్దాన్ (20) తక్కువ పరుగులకే వెనుదిరిగినా.. రహ్మత్ షా, కెప్టెన్ షాహిదీ ఆదుకున్నారు. ఈ క్రమంలోనే రహ్మత్ షా.. వరుసగా మూడో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఇక అఫ్గాన్ విజయం దిశగా వెళ్తున్న సమయంలో రహ్మత్ షా.. ఔటనా, షాహిదీ మిగిలిన పనిని ఓమర్జాయ్తో కలిసి పూర్తి చేశాడు.
నెదర్లాండ్స్ రనౌట్ పరంపర.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న నెదర్లాండ్స్ తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. ఓపెనర్ బరెసీ (1) ఎల్బిడబ్ల్యూగా ఔటయ్యాడు. తర్వాత మరో ఓపెనర్ మ్యాక్స్ ఓడో (42), అక్మన్ (29) ఫర్వాలేదనిపించారు. ఇక సైబ్రాండ్ (58) హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఈ ముగ్గురు తప్పా.. డట్ జట్టులో ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. అయితే నెదర్లాండ్స్ ఇన్నింగ్స్‌లో టాప్ 5 బ్యాటర్లలో నలుగురు రనౌట్ కావడం విశేషం. అఫ్గాన్ బౌలర్లలో మహ్మద్ నబీ 3, నూర్ అహ్మద్ 2, ముజీబ్ 1 వికెట్ పడగొట్టారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
SL vs AFG World Cup 2023 : శ్రీలంకపై అఫ్గాన్ ఘన విజయం.. వరల్డ్ కప్‌లో ముచ్చటగా మూడో గెలుపు
NED vs BAN World Cup 2023 : ప్రపంచకప్‌లో మరో సంచలనం.. నెదర్లాండ్స్‌కు రెండో విజయం.. బంగ్లా చిత్తు!