ETV Bharat / sports

పది నెలల నిరీక్షణ ఫలించింది.. రికార్డు దక్కింది! - నాథన్ లియోన్ 400 వికెట్ల క్లబ్

Nathan Lyon Test Wickets: యాషెస్ సిరీస్​లో భాగంగా ఇంగ్లాండ్​తో జరిగిన తొలి టెస్టులో ఘనవిజయం సాధించింది ఆస్ట్రేలియా. అయితే ఈ మ్యాచ్​ ద్వారా ఓ రికార్డును నెలకొల్పాడు ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియోన్.

Nathan Lyon test reecord, test wickets, నాథన్ లియోన్ టెస్టు రికార్డు, నాథన్ లియోన్ టెస్టు వికెట్లు
Nathan Lyon
author img

By

Published : Dec 11, 2021, 1:23 PM IST

Nathan Lyon Test Wickets: యాషెస్‌ టెస్టు సిరీస్‌లో భాగంగా గబ్బా వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్‌పై ఆస్ట్రేలియా జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకున్న ఆసీస్‌ స్సిన్నర్‌ నాథన్‌ లియోన్ 400 వికెట్ల క్లబ్‌లోకి చేరాడు. ఇంగ్లాండ్ బ్యాటర్‌ డేవిడ్ మలన్‌ను ఔట్ చేయడం ద్వారా అతడు ఈ ఘనత సాధించాడు. దీంతో ఆస్ట్రేలియా తరఫున టెస్టు క్రికెట్లో నాలుగు వందలకు పైగా వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. మాజీ ఆటగాళ్లు షేన్‌ వార్న్‌ (708 వికెట్లు), గ్లెన్‌ మెక్‌ గ్రాత్‌ (563 వికెట్లు) ఇతడికంటే ముందున్నారు.

ఈ మైలురాయిని చేరుకోవడానికి లియోన్ చాలా కాలం వేచి చూడాల్సి వచ్చింది. ఈ ఏడాది జనవరిలో భారత్-ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా భారత ఆటగాడు వాషింగ్టన్ సుందర్‌ను ఔట్ చేయడం ద్వారా లియోన్‌ 399 వికెట్లకు చేరువయ్యాడు. మరో వికెట్ తీసేందుకు అతడు పది నెలలకు పైగా వేచి చూడాల్సి వచ్చింది. తాజాగా గబ్బా వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్​లో ఇంగ్లాండ్‌ ఆటగాడు మలన్‌ను ఔట్ చేయడం ద్వారా లియోన్‌ నిరీక్షణకు తెరపడినట్లయింది.

ప్రస్తుతం లియోన్ 403 వికెట్లతో టెస్టుల్లో అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో 17వ స్థానంలో కొనసాగుతున్నాడు. కాగా, భారత సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్ (427 వికెట్లు) 12వ స్థానంలో ఉన్నాడు. లియోన్ సాధించిన ఈ ఘనత పట్ల పలువురు మాజీ క్రికెటర్లు సంతోషం వ్యక్తం చేశారు. వీవీఎస్‌ లక్ష్మణ్‌, పార్ధివ్‌ పటేల్ తదితరులు అతడిని ట్విట్టర్ వేదికగా ప్రశంసించారు.

ఇవీ చూడండి: ఇంగ్లాండ్​పై ఆసీస్ విజయం.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టాప్​కు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.