ETV Bharat / sports

ఆ సీక్రెట్​ కోడ్​ అర్థమేంటి.. అందుకే లంక విజయం సాధించిందా? - సీక్రెట్​ కోడ్స్​ శ్రీలంక ప్లేయర్స్​

ఆసియాకప్​ 2022లో శ్రీలంక విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. లంకేయులు అంచనాలకు మించి రాణించి ట్రోఫీని ముద్దాడారు. టోర్నీ తొలి మ్యాచులో ఓడినా.. ఆపై పుంజుకుని ఆరోసారి ఛాంపియన్‌గా అవతరించింది. పాకిస్థాన్​పై తుదిపోరులో 23 పరుగులతో విజయం సాధించింది. అయితే.. ఈ విజయం వెనక ఒక సీక్రెట్ కోడ్ ఉందన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అసలు ఆ సీక్రెట్ కోడ్స్ ఏంటి? ఎవరు పంపారు? తెలుసుకుందాం..

srilanka secret code
శ్రీలంక సీక్రెట్ కోడ్​
author img

By

Published : Sep 13, 2022, 1:17 PM IST

ఆసియా కప్ ఫైనల్​లో శ్రీలంక విజేతగా నిలిచినా.. ఇప్పుడా విజయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీక్రెట్ కోడ్స్​తో లంకేయులు చీట్ చేశారంటూ ప్రచారం జరుగుతోంది. అసలేం జరిగిందంటే..

మ్యాచ్​పై తమ జట్టు పట్టు కోల్పోతున్న ప్రతి సందర్భలోనూ కోచ్​ క్రిస్ వుడ్.. మ్యాచ్​ మధ్యలో సీక్రెట్​ కోడ్స్​తో దర్శనమిస్తుంటాడు. అయితే ఇప్పుడా 'సీక్రెట్ కోడ్స్'పై పెద్ద చర్చ నడుస్తోంది. మ్యాచ్​ మధ్యలో ప్రతిసారి 2D, D5, 4A, 4C, B4.. అంటూ ఆల్ఫాబెట్, న్యూమరికల్ కలగలిపిన కోడింగ్ ఫార్మాట్​ను సిగ్నల్​గా పంపిస్తున్నాడు. అయితే ఇది చాలా మందికి అర్థం కావట్లేదు.

అయితే దీనిపై అతడు గతంలోనే ఓ సారి చెప్పాడు. "ఇందులో రాకెట్ సైన్స్ ఏమీ లేదు. అవి మ్యాచ్ మధ్యలో కెప్టెన్​కు ఇచ్చే సలహాలు మాత్రమే. బ్యాటర్​ స్ట్రైక్​లోకి వస్తే.. బాగా ఆడేందుకు ఉపయోగపడతాయి. అయినా చాలా జట్లు ఇలాంటి పద్ధతులను పాటిస్తున్నాయి. అవి కేవలం కెప్టెన్లకు సూచనలు మాత్రమే" అని కోచ్ సిల్వర్​ వుడ్ అన్నాడు.

ఏదేమైనప్పటికీ సిల్వర్ వుడ్ పంపిన 'సీక్రెట్ కోడ్స్'ను కొందరేమో దీన్ని చీటింగ్ అంటుండగా, మరికొందరేమో ఇదొక స్ట్రేటజీ అంటూ కితాబిస్తున్నారు. గతంలో ఇంగ్లాండ్ కోచ్​గా పనిచేసిన క్రిస్ సిల్వర్ వుడ్.. అక్కడ కూడా ఇలానే సీక్రెట్ కోడ్స్ పంపేవాడట. యాషెస్ సిరీస్​లో ఆస్ట్రేలియా చేతిలో దారుణ ఓటమితో ఆ బాధ్యతల నుంచి తప్పుకున్న సిల్వర్ వుడ్, ప్రస్తుతం శ్రీలంక కోచ్​గా నియమితుడై.. లంకేయులలో ఆత్మ విశ్వాసాన్ని నింపి విజేతగా నిలిపాడు.

ఇదీ చూడండి: రోహిత్-దినేశ్ కార్తీక్​.. ఆ మ్యాజిక్ రిపీట్​ అవుతుందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.