ETV Bharat / sports

సచిన్​ వీరాభిమాని సుధీర్​​ను కొట్టిన పోలీసులు.. కారణం ఇదే!

భారత క్రికెట్​ దిగ్గజం సచిన్ తెందూల్కర్ వీరాభిమాని సుధీర్ కుమార్​కు బిహార్​లోని ఓ పోలీస్​స్టేషన్​లో చేదు అనుభవం ఎదురైంది. కస్టడీలో ఉన్న తన సోదరుడ్ని కలిసేందుకు వెళ్లిన సుధీర్​పై పోలీసులు చేయిచేసుకున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు సుధీర్.

muzaffarpur police
ముజఫర్​పుర్ పోలీసులు
author img

By

Published : Jan 22, 2022, 9:52 AM IST

భారత్​లో క్రికెట్​ అభిమానులకు సుధీర్ కుమార్​ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్​కు వీరాభిమానైన సుధీర్​.. టీమ్​ఇండియా ఆడే ప్రతి మ్యాచ్​లో పాల్గొని సందడి చేస్తుంటాడు. అయితే.. తాజాగా సుధీర్ కుమార్​కు బిహార్​లోని ఓ పోలీస్ స్టేషన్​లో చేదు అనుభవం ఎదురైంది.

ఏమైందంటే..

సుధీర్ కుమారుడ్ సోదరుడు కిషన్​ కుమార్​ను ​ఓ కేసులో భాగంగా ముజఫర్​పుర్ స్టేషన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కస్టడీలో ఉన్న తన సోదరుడ్ని కలిసేందుకు సుధీర్ పోలీస్ స్టేషన్​కు వెళ్లాడు. ఈ క్రమంలో అక్కడి పోలీసులు సుధీర్​తో అసభ్యంగా ప్రవర్తించారు. అంతేకాక సుధీర్​పై చేయి చేసుకున్నారు.

ఈ ఘటనపై ఉన్నతాధికారులకు సుధీర్ ఫిర్యాదు చేశాడు. ఈ విషయాన్ని సీరియస్​గా తీసుకున్న అధికారులు విచారణకు ఆదేశించారు. ఇలాంటి చర్యకు పాల్పడినవారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: 'కోహ్లీకి షోకాజ్​ నోటీసులు'.. ఆ వార్తల్లో నిజం లేదు: గంగూలీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.