Mushfiqur Rahim Retirment: బంగ్లాదేశ్ స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్.. ఆదివారం అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. "నేను అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను. టెస్ట్, వన్డే ఫార్మాట్‌లపై దృష్టి పెట్టాలనుకుంటున్నాను. అవకాశం వచ్చినప్పుడు ఫ్రాంచైజీ లీగ్‌లు ఆడేందుకు అందుబాటులో ఉంటాను" అంటూ ట్వీట్ చేశాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టి.. ముష్ఫికర్ రహీమ్ ఆదివారంతో 15 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు.
బంగ్లాదేశ్ జట్టు తరఫున 102 అంతర్జాతీయ టీ20 మ్యాచులు ఆడాడు ముష్ఫికర్ రహీమ్. 1500 పరుగులు సాధించగా.. అందులో 37 సిక్సులు, 127 ఫోర్లు ఉన్నాయి. వన్డేల విషయానికొస్తే.. 236 మ్యాచులు ఆడిన ముష్ఫికర్.. 6774 పరుగులు సాధించాడు. 85 సిక్సులు, 533 ఫోర్లు బాదాడు. 82 టెస్ట్ మ్యాచులు ఆడిన అతడు.. 5235 పరుగులు సాధించాడు. అందులో 31 సిక్సులు, 625 ఫోర్లు ఉన్నాయి.
ముష్ఫికర్ గత పది టీ20 మ్యాచుల్లో తక్కువ స్కోర్లతోనే పెవిలియన్ చేరాడు. 2022 ఆసియా కప్‌లో రెండు మ్యాచులు ఆడిన అతడు కేవలం ఐదు పరుగులు మాత్రమే చేశాడు.
ఇవీ చదవండి: ఆ పదం నోటి దాకా వచ్చినా.. పలకడానికి ఇష్టపడని ద్రవిడ్
భారత్‌తో మ్యాచ్ అంటేనే తీవ్ర ఒత్తిడి.. మాకు అండగా నిలవండి: పాక్ క్రికెటర్