ETV Bharat / sports

సర్ఫరాజ్ సూపర్​ ఇన్నింగ్స్‌.. ముస్తాక్‌ అలీ ట్రోఫీ విజేతగా ముంబయి - syed mushtaq ali trophy mumbai won

SMAT 2022: సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ-2022 టైటిల్​ను సొంతం చేసుకుంది ముంబయి జట్టు. ఈ మ్యాచ్‌లో సర్ఫరాజ్‌ ఖాన్‌ కీలక ఇన్నింగ్స్​ ఆడాడు.

SMAT 2022 Winner
SMAT 2022 Winner
author img

By

Published : Nov 5, 2022, 10:09 PM IST

Updated : Nov 5, 2022, 10:47 PM IST

SMAT 2022 Winner: సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ-2022 విజేతగా ముంబయి జట్టు నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో ముంబయి.. హిమాచల్‌ప్రదేశ్‌ను 3 వికెట్ల తేడాతో ఓడించి తొలిసారి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో సర్ఫరాజ్‌ ఖాన్‌ (31 బంతుల్లో 36 నాటౌట్‌; 3 ఫోర్లు, సిక్స్‌) కీలక ఇన్నింగ్స్‌ ఆడగా, తనుష్‌ కోటియన్‌ తొలుత బౌలింగ్‌లో (3/15, 5 బంతుల్లో 9 నాటౌట్‌; సిక్స్‌), ఆ తర్వాత బ్యాటింగ్‌లో ఉత్కంఠ సమయంలో సిక్సర్‌ కొట్టి ముంబయిని గెలిపించాడు.

టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన ముంబయి.. తనుష్‌ కోటియన్‌, మోహిత్‌ అవస్థి (3/15), అమన్‌ హకీం ఖాన్‌ (1/24), శివమ్‌ దూబే (1/16) బంతితో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. ఏకాంత్‌ సేన్‌ (37) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో ముంబయి ఆరంభంలోనే తడబడినప్పటికీ.. యశస్వీ జైస్వాల్‌ (27), శ్రేయస్‌ అయ్యర్‌ (34), సర్ఫరాజ్‌ ఖాన్‌ ఓ మోస్తరుగా రాణించి ముంబయిని విజేతగా నిలిపారు. 12 బంతుల్లో 23 పరుగులు చేయాల్సిన సమయంలో సర్ఫరాజ్‌ ఖాన్‌ 2 ఫోర్లు, సిక్సర్‌ బాది జట్టును గెలుపు ట్రాక్‌లో పెట్టాడు. ఆఖరి ఓవర్‌లో ముంబయి గెలుపుకు 8 పరుగులు అవసరం కాగా.. తనుష్‌ కోటియన్‌.. రిషి ధవన్‌ వేసిన మూడో బంతికి సిక్సర్​ బాది ముంబయి కలను సాకారం చేశాడు.

Last Updated : Nov 5, 2022, 10:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.