Mumbai Indians on IPL Biosecure: మరో ఆరు రోజుల్లో ఐపీఎల్ -15వ సీజన్ ప్రారంభం కానుంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈసారి అన్ని మ్యాచ్‌లను ముంబయి, పుణె వేదికల్లోనే బీసీసీఐ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో తమ ఆటగాళ్ల భద్రతకు ముంబయి ఇండియన్స్ ప్రత్యేకంగా అవుట్‌డోర్ 'బయో సెక్యూర్'ను ఏర్పాటు చేసింది. జియో వరల్డ్ గార్డెన్‌లో దాదాపు 13వేల చదరపు మీటర్ల వైశాల్యంలో ఆటగాళ్లు, సిబ్బందికి కుటుంబ సభ్యులతో సహా రిఫ్రెష్ కావడానికి ఈ 'బయో సెక్యూర్ ఎంఐ ఎరేనా'ను సృష్టించింది. ఐపీఎల్ జరిగేది సొంత ప్రదేశంలో అయినప్పటికీ ఆటగాళ్లకు మానసికంగా, శారీరకంగా విశ్రాంతి తీసుకోవడమే కాకుండా వినోదం అందించడానికి ముంబయి ఫ్రాంచైజీ ఏర్పాట్లు చేసింది. బీసీసీఐ 'బయో సెక్యూర్ బబుల్'లో భాగంగానే 'ఎంఐ ఎరేనా' ఉంటుందని ముంబయి ఫ్రాంచైజీ ప్రకటన వెల్లడించింది.
-
The opening of MI Arena was a total धमाल event! 🤩
— Mumbai Indians (@mipaltan) March 21, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
P.S. You will just love Ro in this video. He was truly in his element. 🤣💙#OneFamily #MumbaiIndians MI TV pic.twitter.com/OB1MSXZpkU
">The opening of MI Arena was a total धमाल event! 🤩
— Mumbai Indians (@mipaltan) March 21, 2022
P.S. You will just love Ro in this video. He was truly in his element. 🤣💙#OneFamily #MumbaiIndians MI TV pic.twitter.com/OB1MSXZpkUThe opening of MI Arena was a total धमाल event! 🤩
— Mumbai Indians (@mipaltan) March 21, 2022
P.S. You will just love Ro in this video. He was truly in his element. 🤣💙#OneFamily #MumbaiIndians MI TV pic.twitter.com/OB1MSXZpkU
"'ఎంఐ ఎరేనా'లో మైదానం, బాల్ కోర్ట్, బాక్స్ క్రికెట్, ఫుట్ వాలీబాల్, గోల్ఫ్ డైవింగ్ రేంజ్, ఎంఐ బ్యాటిల్‌గ్రౌండ్, మినీ గోల్ఫ్, ఎంఐ కేఫ్, కిడ్స్ జోన్ తదితర సదుపాయాలు ఉన్నట్లు ముంబయి తెలిపింది. "ఆటగాళ్లు ఒకరినొకరు బాగా కనెక్ట్ అయ్యేందుకు ఎంఐ ఎరేనాను సృష్టించాం. గత రెండేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సవాళ్లను ఎదురయ్యాయి. 'ఒకే కుటుంబం' అనేది ముంబయి ఇండియన్స్ నినాదం. అందులో భాగంగా ప్రతి ఒక్కరినీ సురక్షితంగా, సంతోషంగా ఉంచడమే మా ప్రాధాన్యం, బాధ్యత" అని ముంబయి ఇండియన్స్ పేర్కొంది.
ఈ షారుక్ కోసం.. ఆ షారుక్ పాట
తమ యువ ఆటగాడు షారుక్ ఖాన్ కోసం బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ పాటను పంజాబ్ కింగ్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో వాడేసుకుంది. నెట్స్‌లో శ్రమిస్తున్న షారుక్ వీడియోను పంజాబ్ తన అధికారిక ట్విటర్‌లో పోస్టు చేసింది. దానికి 'బాద్ షా.. బాద్ షా' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఐపీఎల్ మెగా వేలంలో షారుక్‌ను పంజాబ్‌కింగ్స్ రూ.9 కోట్లకు దక్కించుకుంది.
-
𝐁𝐚𝐚𝐝𝐬𝐡𝐚𝐡, 𝐨𝐡 𝐁𝐚𝐚𝐝𝐬𝐡𝐚𝐡! 👑#SaddaPunjab #PunjabKings #TATAIPL2022 @shahrukh_35 pic.twitter.com/GS1stlrIJS
— Punjab Kings (@PunjabKingsIPL) March 20, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">𝐁𝐚𝐚𝐝𝐬𝐡𝐚𝐡, 𝐨𝐡 𝐁𝐚𝐚𝐝𝐬𝐡𝐚𝐡! 👑#SaddaPunjab #PunjabKings #TATAIPL2022 @shahrukh_35 pic.twitter.com/GS1stlrIJS
— Punjab Kings (@PunjabKingsIPL) March 20, 2022𝐁𝐚𝐚𝐝𝐬𝐡𝐚𝐡, 𝐨𝐡 𝐁𝐚𝐚𝐝𝐬𝐡𝐚𝐡! 👑#SaddaPunjab #PunjabKings #TATAIPL2022 @shahrukh_35 pic.twitter.com/GS1stlrIJS
— Punjab Kings (@PunjabKingsIPL) March 20, 2022
ఇదీ చదవండి: భారత్-లంక పింక్ బాల్ టెస్టు.. పిచ్‌కు దారుణమైన రేటింగ్!