వెస్టిండీస్ మాజీ క్రికెటర్ కీరన్ పొలార్డ్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. వచ్చే సీజన్ నుంచి ముంబయి ఇండియన్స్‌కు బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ పొలార్డ్ ఓ సుదీర్ఘమైన పోస్ట్‌ను రాసుకొచ్చాడు. మరికొన్ని సంవత్సరాలు ఆడాలని అనుకున్నట్లు అందులో చెప్పుకొచ్చాడు. "ముంబయి టీమ్‌లో మార్పులు అవసరం. నేను ఇప్పుడు ఆ జట్టుకు ఆడలేకపోతున్నాను. నేను ఎప్పటికీ ముంబయికి అండగానే ఉంటాను" అని చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ కెరీర్..
పొలార్డ్ తన కెరీర్లో ముంబయికి మాత్రమే ప్రాతినిధ్యం వహించాడు. 171 ఇన్నింగ్స్‌లలో 3412 పరుగులు చేశాడు. ఈ మెగాలీగ్‌లో అతడి బ్యాటింగ్ సగటు 28.67 కాగా, అతని కెరీర్ స్ట్రైక్ రేట్ 147.32గా ఉంది. 16 అర్ధ సెంచరీలు చేశాడు. అత్యుత్తమ ఫినిషర్‌లలో ఒకడిగా పేరుగాంచాడు. దశాబ్దానికి పైగా జట్టులో అత్యంత నిలకడగా రాణించిన పొలార్డ్.. గత సీజన్‌లో తీవ్రంగా నిరాశపరిచాడు. 11 మ్యాచ్‌ల్లో 14.40 సగటుతో 144 పరుగులు మాత్రమే చేశాడు.
ఇదీ చదవండి:తెలుగు తేజాలు నిఖత్ జరీన్, శ్రీజకు అర్జున.. ప్రకటించిన కేంద్రం