ETV Bharat / sports

Rohith Sharma: 'రోహిత్ అలా టెస్ట్​ల్లో ఓపెనర్​గా మారాడు'

టెస్టుల్లో రోహిత్ శర్మ(Rohith Sharma)​ ఓపెనర్​గా ఎలా మారడనే విషయాన్ని మాజీ సెలక్టర్​ ఎమ్మెస్కే ప్రసాద్ వెల్లడించాడు. వన్డేల్లో లాగానే టెస్ట్ కెరీర్​ ఆరంభంలోనూ చాలా ఒడుదొడుకులు ఎదుర్కొన్నాడని గుర్తుచేసుకున్నాడు.

rohit sharma, team india cricketer
రోహిత్ శర్మ, టీమ్ఇండియా క్రికెటర్
author img

By

Published : Jun 13, 2021, 4:41 PM IST

సుదీర్ఘ ఫార్మాట్​లో రోహిత్​ శర్మ ఓపెనర్​గా ఎలా నిలదొక్కుకున్నాడనే విషయాన్ని మాజీ సెలక్టర్​ ఎమ్మెస్కే ప్రసాద్(MSK Prasad) వివరించాడు. వన్డేల్లో స్థానం కోసం ఇబ్బంది పడినట్లే.. టెస్టుల్లోనూ కష్టాలను ఎదుర్కొన్నాడని వెల్లడించాడు. హిట్​మ్యాన్​ కెరీర్​లో ఎన్నో ఒడుదొడుకులను చవిచూశాడని గుర్తుచేసుకున్నాడు.

"జట్టు యాజమాన్యానికి అతడిపై ఉన్న నమ్మకం కారణంగానే అతడిని టెస్ట్ ఓపెనర్​గా ఎంపిక చేశాం. ఓపెనర్​గా తొలి టెస్ట్​లోనే దక్షిణాఫ్రికాపై 176, 127 పరుగులు చేశాడు. అప్పటి వరకు అతని క్రికెట్ కెరీర్ చాలా ఎత్తుపల్లాలను చవిచూసింది. 2016-17 సీజన్ తర్వాత అతడు వెనక్కి తిరిగి చూసుకోలేదు. 2019 ప్రపంచకప్ తర్వాత అతనిపై చాలా నమ్మకం వచ్చింది. మిడిలార్డర్​లో కోహ్లీ, పుజారా, విహారి, రహానెలా ఆడగలతాడని భావించాం. టెస్ట్​ క్రికెట్​లో ఓపెనర్​గా కొనసాగగలడని అనిపించింది. ఇదే విషయమై కోహ్లీ(Kohli), శాస్త్రిలతో(Ravisastri) మాట్లాడాను. ఆ తర్వాత వచ్చిన అవకాశాలను అతడు రెండు చేతులతో ఒడిసి పట్టాడు. అద్భుతమైన డబుల్ సెంచరీతో తానేంటో నిరూపించుకున్నాడు" అని ప్రసాద్ పేర్కొన్నాడు.

ఇదీ చదవండి: 'అలా జరిగితే భారత్​తో ఇంగ్లాండ్​కు కష్టమే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.