Ms Dhoni US Open : టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ యూఎస్ ఓపెన్‌లో సందడి చేశాడు. ఈ టోర్నమెంట్లో గురువారం కార్లోస్ అల్కరాస్, అలెగ్జాండర్ జ్వెరెవ్ మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ను.. స్టేడియంలో స్నేహితులతో కలిసి వీక్షించాడు. ఓ సాధారణ ప్రేక్షకుడిగా మ్యాచ్‌ను ఆస్వాదించాడు. అయితే ఆట మధ్యలో స్పెయిన్ ఆటగాడు అల్కరాస్.. రెస్ట్ తీసుకొని డ్రింక్స్ తాగుతుండగా అతడి వెనుకవైపు ఫ్రెండ్స్‌తో కూర్చొని ముచ్చటిస్తున్న ధోనీ కెమెరాకు చిక్కాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. అయితే అతడికి టెన్నిస్ ఆటంటే ఎంత ఇష్టమో గతంలో ధోనీ పలు సందర్భాల్లో చెప్పాడు.
MS Dhoni Leg Surgery : అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోనీ.. ప్రస్తుతం కెరీర్లో ఐపీఎల్ మాత్రమే ఆడుతున్న సంగతి తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా కొనసాగుతున్నాడు. ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్‌ను విజేతగా నిలిపాడు. ఐపీఎల్-2023లో మహీ చెన్నై సూపర్ కింగ్స్‌ను విజేతగా నిలిపిన సంగతి తెలిసిందే. అనంతరం అతడు మోకాలికి శస్త్రచికిత్స చేయించుకుని కోలుకున్నాడు. ప్రస్తుతం తన కుటుంబం, స్నేహితులతో సమయాన్ని గడుపుతూ లైఫ్‌ను కాస్త ఎంజాయ్ చేస్తున్నాడు.
-
Like us, @msdhoni is a tennis fan too 🥹
— Sony Sports Network (@SonySportsNetwk) September 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Indian cricket sensation Mahendra Singh Dhoni was in the audience for the quarter-final clash between @carlosalcaraz & @AlexZverev 🎾#SonySportsNetwork #USOpen | @usopen pic.twitter.com/STPmLlCdvS
">Like us, @msdhoni is a tennis fan too 🥹
— Sony Sports Network (@SonySportsNetwk) September 7, 2023
Indian cricket sensation Mahendra Singh Dhoni was in the audience for the quarter-final clash between @carlosalcaraz & @AlexZverev 🎾#SonySportsNetwork #USOpen | @usopen pic.twitter.com/STPmLlCdvSLike us, @msdhoni is a tennis fan too 🥹
— Sony Sports Network (@SonySportsNetwk) September 7, 2023
Indian cricket sensation Mahendra Singh Dhoni was in the audience for the quarter-final clash between @carlosalcaraz & @AlexZverev 🎾#SonySportsNetwork #USOpen | @usopen pic.twitter.com/STPmLlCdvS
US Open 2023 Carlos Alcaraz vs Alexander Zverev : ఇక ఆట విషయానికొస్తే.. గతేడాది యూఎస్ ఓపెన్ టైటిల్ ముద్దాడిన అల్కారజ్.. ఈ సారి కూడా అదే జోరును కొనసాగిస్తున్నాడు. వరల్డ్ నెం.1 కార్లోస్ అల్కరాస్.. జర్మనీ ప్లేయర్ 12వ సీడ్, అలెగ్జాండర్ జ్వెరెవ్‌పై విజయం సాధించాడు. 2.30 గంటల పాటు సాగిన ఈ పోరులో అల్కరాజ్ ఆరంభం నుంచే ఆధిపత్యం చెలాయించి వరుస సెట్లలో విజయం సాధించాడు. 6-3, 6-2, 6-4 తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టాడు. ఈ విజయంతో ప్రపంచ నంబర్‌వన్ కార్లోస్ అల్కరాస్ సెమీ ఫైనల్లోకి అడుగుపెట్టాడు. కానీ ఇప్పుడతడికి నోవాక్ జకోవిచ్ నుంచి గట్టి పోటీ ఎదురు కానుంది. జకోవిచ్ కూడా సెమీపైనల్‌కు అర్హత సాధించాడు.
Netherlands World Cup Squad 2023 : ప్రపంచ కప్ జట్టులో తెలుగు కుర్రాడికి చోటు!