ETV Bharat / sports

Dhoni Sachin: స్టార్ క్రికెటర్ ధోనీ.. టీచర్​ పోస్టుకు దరఖాస్తు​!

క్రికెట్​ నుంచి రిటైర్​ అయ్యాక సరదాగా కాలక్షేపం చేస్తున్న టీమ్​ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ.. టీచర్​ పోస్టుకు దరఖాస్తు చేయడమేంటని ఆలోచిస్తున్నారా? ఒకసారి ఈ స్టోరీ చదవండి. అసలు విషయం మీకే తెలుస్తుంది.

Dhoni teacher application
ఎంఎస్ ధోనీ
author img

By

Published : Jul 3, 2021, 3:56 PM IST

Updated : Jul 3, 2021, 4:15 PM IST

టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ(Dhoni) టీచర్ పోస్టుకు దరఖాస్తు చేశాడు. అదీ సచిన్​ తెందుల్కర్​ తనయుడిగా. ఏమిటీ.. షాక్​ అయ్యారా?.

ఛత్తీస్​గఢ్ రాయ్​పుర్​​లో ఉపాధ్యాయుడి పోస్టుకు దరఖాస్తు చేసినవారిలో ఒకరి పేరు ఎంఎస్ ధోనీ. అతడు తన తండ్రి పేరు స్థానంలో సచిన్ తెందుల్కర్​ అని నింపాడు. ఇలా అరుదైన పేర్ల కాంబినేషన్​ ఉన్నప్పటికీ ఇంటర్వ్యూ వరకు అతడి ఎంపిక జరిగింది.

Dhoni teacher application
ధోనీ s/o సచిన్​ తెందుల్కర్​గా ఉన్న దరఖాస్తు

అయితే మౌఖిక పరీక్షకు హాజరు కాకపోవడం వల్ల అసలు విషయం బయటపడింది. అభ్యర్థికి కాల్​ చేసిన తర్వాత అది నకిలీ దరఖాస్తుగా తేలింది. ఈ 'ఎంఎస్​ ధోనీ'.. దుర్గ్​లోని సీఎస్​వీటీయూ యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్​ పూర్తి చేశాడు.

ఈ దరఖాస్తు కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. సాధారణంగా ఇలాంటి వాటిని చూసీచూడనట్లు వదిలేసే అధికారులు.. నకిలీ దరఖాస్తుదారుడిపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేయాలని నిర్ణయించారు.

ఇదీ చూడండి: ధోనీ, కోహ్లీ కాదు.. భారత​ ధనిక క్రికెటర్​ ఎవరు?

Last Updated : Jul 3, 2021, 4:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.