ETV Bharat / sports

ధోనీ గ్యారేజ్​లో కొత్త కారు.. ప్రత్యేకతలివే

MS Dhoni News: టీమ్​ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ గ్యారేజ్​లో కొత్త కారు చేరింది. మరి ఆ కారు ప్రత్యేకతలేంటో ఓసారి చూసేద్దాం.

dhoni
ధోనీ
author img

By

Published : Jan 19, 2022, 8:05 AM IST

MS Dhoni News: టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్ ధోనీ పేరు వినగానే ఎవరికైనా.. అతడు సాధించిన ఘన విజయాలే గుర్తొస్తాయి. కెప్టెన్‌గా భారత జట్టును అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లాడు. భారత క్రికెట్ చరిత్రలో ధోనీకి ప్రత్యేక స్థానం ఉంది. ధోనీకి క్రికెట్ అంటే ఎంత ఇష్టమో.. వింటేజ్‌ కార్లు, బైకులన్నా అంతే ఇష్టం. వాటి కోసమే ఓ గ్యారేజ్‌ను నిర్వహిస్తున్నాడంటే.. అవి అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు అతడి గ్యారేజ్‌లోకి మరో వింటేజ్‌ ల్యాండ్‌ రోవర్‌ కారు చేరింది.

గత నెలలో గురుగ్రామ్‌లోని 'బిగ్ బాయ్‌ టాయ్జ్ (బీబీటీ)‌' అనే షో రూం నిర్వహించిన వేలంలో పాల్గొన్న ధోనీ.. 1970 మోడల్‌ ల్యాండ్ రోవర్‌ 3 కారును సొంతం చేసుకున్నాడు. ఈ ల్యాండ్ రోవర్‌ కారుకు ఆటోమొబైల్‌ రంగంలో ప్రత్యేక స్థానం ఉంది. 1970 దశకం నుంచి 1980 మధ్య కాలం వరకు దీన్ని తయారు చేసేవారు. 2.25 లీటర్ల ఇంజిన్‌ సామర్థ్యం గల ఈ కారు మ్యానువల్ ట్రాన్స్‌మిషన్‌తో నడుస్తుంది. ఆన్‌లైన్‌ వేలం ద్వారా 50 శాతానికి పైగా స్టాక్‌ను విక్రయించినట్లు బీబీటీ షో రూం పేర్కొంది.

ఇదీ చదవండి:

ధోనీకి కేకేెఆర్​ పంచ్.. జడేజా దిమ్మతిరిగే కౌంటర్

ధోనీ సలహాను ఇప్పటికీ పాటిస్తున్నా: కోహ్లీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.