ETV Bharat / sports

'ధోనీకీ మూఢ నమ్మకాలు ఉన్నాయ్​'

టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్​ ధోనీ గురించి ఆసక్తికర అంశాలు వెల్లడించాడు భారత మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్​ ఓజా. మహీకి మూఢ నమ్మకాలు ఉండేవని తెలిపాడు. మ్యాచ్​ ప్రారంభానికి ముందు కనీసం జట్టు సహచరులకు అభినందించే వాడు కాదని పేర్కొన్నాడు.​

ms dhoni, MS Dhoni never wishes his teammates good luck before a match
మహేంద్ర సింగ్ ధోనీ, 'సచిన్​లాగే ధోనీకీ మూఢ నమ్మకాలు ఉన్నాయి'
author img

By

Published : Apr 21, 2021, 3:39 PM IST

భారత క్రికెట్ దిగ్గజం సచిన్.. బ్యాటింగ్​కు దిగే ముందు తన ఎడమ కాలికి ముందు ప్యాడ్​ కట్టుకునేవాడు. 2011 ప్రపంచకప్ ఫైనల్​ మ్యాచ్​ సందర్భంగా డ్రెస్సింగ్​ రూమ్​లో ఏ సహచరున్ని సీట్లో నుంచి లేవనీయలేదంట. తన కిట్​ బ్యాగ్​లో ఎప్పుడూ సాయిబాబ ఫొటో పెట్టుకునే వాడు. ఇవన్నీ ఇప్పుడు ఎందుకనుకుంటున్నారా?

కొంతమంది క్రికెటర్లు ఎంత ప్రతిభ ఉన్నప్పటికీ వారికి కొన్ని సెంటిమెంట్లు, మూఢ నమ్మకాలు ఉంటాయి. అందులో భాగంగానే సచిన్​ అలా ప్రవర్తించేవాడు. భారత మాజీ కెప్టెన్​ ధోనీకి కూడా ఇలాంటి నమ్మకాలు ఉన్నాయట. వాటి గురించి మాజీ క్రికెటర్​ ప్రజ్ఞాన్​ ఓజా వెల్లడించాడు.

ఇదీ చదవండి: భారత్​లో తొలిసారి డబ్ల్యూబీసీ ఛాంపియన్​షిప్​

"మ్యాచ్​ ప్రారంభానికి ముందు ధోనీ.. ఏ సభ్యుడికి 'ఆల్​ ది బెస్ట్​', 'గుడ్​ లక్'​ అని చెప్పడు. ఒక సారి ఇలా చెప్పగా ఆ గేమ్​లో ప్రతికూల ఫలితాలు వచ్చాయి. అప్పటినుంచి ఇలా అభినందించడం ఆపేశాడు. మ్యాచ్​కు ముందు ఎవరి నుంచి అతడు ఇలాంటి పదాలు కోరుకోడు" అని ఓజా పేర్కొన్నాడు.

పెన్నులు దాచుకుంటాడు..

ఐపీఎల్​లో భాగంగా బంతులపై సంతకం చేసిన తర్వాత.. ఆ పెన్నులను ధోనీ తన దగ్గరే ఉంచుకుంటాడు. ఈ విషయాన్ని ప్రస్తుతం ఓజాతో పాటు గతంలో దీప్​ దాస్​గుప్తా కూడా వెల్లడించాడు. ​

ఇదీ చదవండి: కెప్టెన్ కోహ్లీ పేరుతో సర్క్యులర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.