ETV Bharat / sports

ms dhoni: సిక్సులు బాదాడు.. బంతి కోసం వెతికాడు!

కరోనా రెండోదశ విజృంభణ కారణంగా అర్ధాంతరంగా వాయిదాపడిన ఐపీఎల్(IPL 2021) త్వరలో ప్రారంభంకానుంది. రాబోయే మ్యాచ్​ల్లో బ్యాటు ఝళిపించేందుకు సీఎస్కే కెప్టెన్ ధోనీ దూకుడుగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. మహీ నెట్స్​లో చెమటోడుస్తూ.. సిక్సుల వర్షం కురిపించాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్​గా మారింది.

Dhoni csk
Dhoni csk
author img

By

Published : Aug 24, 2021, 8:30 PM IST

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS DHONI) ఐపీఎల్(IPL 2021) కోసం సిద్ధమవుతున్నాడు. ఈ మేరకు మిస్టర్ కూల్ దుబాయ్‌లో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. వచ్చిన బంతిని వచ్చినట్టు సిక్సర్​లు బాదాడు మహీ. మ్యాచ్ అనంతరం పార్కులో పడిన బాల్స్ కోసం వెదుకులాడటం ఈ వీడియోలో చూడొచ్చు. ఈ వీడియోను చూసిన అభిమానులు 'మహీ భాయ్ ఈజ్ బ్యాక్' అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

"ప్రాక్టీస్ సెషన్‌ అనంతరం.. మైదానం బయట పడిన బంతుల కోసం ధోనీ వెళ్లాడు. ఎందుకంటే మహీ హిట్టింగ్ ​కారణంగా అవి కనిపించలేదు. అందుకే వాటిని వెతికేందుకు మహీ స్వయంగా వెళ్లాడు."

-చెన్నై సూపర్ కింగ్స్

అప్పుడు పేలవమే..

రెండోదశ విజృంభణ కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయిన ఐపీఎల్-2021 మొదటి భాగంలో.. ధోనీ నేతృత్వంలోని సీఎస్‌కే జట్టు అద్భుతంగా ఆడి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. అయితే.. వ్యక్తిగతంగా ధోనీ గొప్పగా రాణించలేదు. ఆడిన ఏడు మ్యాచుల్లో 12.33 సగటుతో 37 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.