ప్రపంచ క్రికెట్‌లో పరిచయం అక్కర్లేని పేరు మహేంద్ర సింగ్ ధోనీ. జార్ఖండ్ డైనమైట్.. కెప్టెన్ కూల్.. ద ఫినిషర్.. ఇలా ప్రతి అభిమాని మదిలో నిలిచిపోయాడు. ప్రపంచ క్రికెట్‌లో చెరగని ముద్ర వేసిన దిగ్గజాలు సైతం తనకు సలాం కొట్టేలా మైదానంతో సత్తా చాటాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌ను వీడ్కోలు పలికిన అతడు ప్రస్తుతం ఐపీఎల్లో సక్సెస్ఫుల్ కెప్టెన్‌గా సీఎస్కేకు సారథ్యం వహిస్తున్నాడు.
అయితే సోషల్‌మీడియాలో అతడు ఆదివారం పెట్టిన ఓ పోస్ట్ క్రికెట్ అభిమానుల మదిలో పలు అనుమానాలకు దారీ తీసింది. ఎందుకంటే అతడు తన ఫేస్బుక్లో సెప్టెంబరు 25న మధ్యాహ్నం 2 గంటలకు లైవ్‌లో ఓ ఎక్సైటింగ్ న్యూస్‌ను పంచుకోబోతున్నట్లు పోస్ట్ చేశాడు. ఇది చూసిన అభిమానులు ఏంటిదా అని తెగ ఆలోచించేస్తున్నారు. అయితే వీరిలో ఎక్కువమంది.. మహీ ఐపీఎల్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పబోతున్నాడా అని అనుకుంటూ విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు.
వీటన్నికి తెరితీస్తూ మహి ఆ విషయం చెప్పేశాడు. అసలు విషయం అది ధోనీకి సంబంధించిన విషయం కాదు. ఓరియో కుకీస్ ప్రచారంలో భాగంగా ఇది జరిగింది. ఈసారి వరల్డ్ కప్ టీమ్ ఇండియా గెలవబోతుందని చెప్పాడు. ఓరియో బిస్కెట్ల ప్రచారంలో భాగంగా.. ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లా ఏర్పాటు చేశారు. అందులో ఓరియో కంపెనీకి సంబంధించిన మార్కెటింగ్ అధికారి మాట్లాడుతూ.. ఓరియో బిస్కెట్లను మొదటి సారి ఇండియాలో ప్రవేశపెడుతున్నాం అని చెప్పాడు. దానికి ఒక విలేకరి.. ఇంతకముందే ఓరియో భారత్‌లో ఉంది కదా అని అడిగాడు. దీనికి మహి అతడిని స్టేజ్ పైకి పిలిచి.. ' ఓరియో 2011లో భారత్‌లోకి వచ్చినప్పుడు.. టీమ్ ఇండియా వరల్డ్ కప్ గెలిచింది. ఇప్పుడు మళ్లీ ప్రవేశపెడుతున్నారు. ఇప్పుడు కూడా భారత్ వరల్డ్ కప్ గెలుస్తుంది' అని లాజిక్‌తో కొట్టాడు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. వాట్‌ఏ మార్కెటింగ్ స్టంట్ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఇవీ చదవండి: జులన్‌కు ఘనంగా వీడ్కోలు.. ఇంగ్లాండ్ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత్