Dhoni Bowling Kohli Wicket Keeping : టీమ్ఇండియా మాజీ సారథులు, స్టార్ ప్లేయర్స్ ఎం ఎస్ ధోనీ, కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమ ఆటతీరుతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇండియన్ క్రికెట్ హిస్టరీ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. వీరిద్దరూ మైదానంలో ఉంటే ప్రత్యర్థికి చెమటలే. క్రీజులోకి ఎంట్రీ ఇస్తే కొండంత లక్ష్యమైనా కరగాల్సిందే. ఛేజింగ్ మాస్టర్‌గా ఒకరు, ఫినిషర్‌గా మరొకరు భారత జట్టుకు ఎన్నో విజయాలను అందించారు.
Virat Kohli Dhoni match : అయితే గ్రౌండ్లో.. వికెట్ కీపింగ్‌లో టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎం ఎస్ ధోనీ, బ్యాట్‌తో పరుగుల వరద పారించడంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఎంత చురుగ్గా ఉంటారో తెలిసిందే. మరి కీపింగ్ చేసే ధోనీ బౌలింగ్ చేస్తుంటే.. పరుగుల వరద పారింటే కోహ్లీ వికెట్ల వెనక కీపింగ్ చేస్తే.. మీరు ఎప్పుడైనా చూశారా?.. అవును వారిద్దరూ ఓ టెస్ట్ మ్యాచ్‌లో కాసేపు తమ పొజిషన్స్ మార్చుకుని ఆడుతూ ఆడియెన్స్‌ను అలరించారు. న్యూజిలాండ్‌తో(dhoni vs new zealand) జరిగిన ఓ మ్యాచ్‌లో ధోనీ ఓ ఓవర్ బౌలింగ్ చేసి 5 పరుగులు సమర్పించుకున్నాడు. విరాట్ కీపింగ్ చేశాడు(Kohli vs new zealand). ఈ టెస్ట్ మ్యాచ్ కొన్నేళ్ల క్రితం జరిగిందే అయినా.. తాజాగా వీరి ఆటకు సంబంధించిన వీడియోను న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు షేర్ చేసింది. ప్రస్తుతం అది చూసి అభిమానులు వీడియోను ట్రెండ్ చేస్తూ లైక్స్, షేర్ చేస్తున్నారు.
2008 నుంచి.. ఒక దశాబ్దానికిపైగా ధోనీ, కోహ్లీలు టీమ్ఇండియాకు ఎన్నో గుర్తిండిపోయే విజయాలను అందించారు. 2008 నుంచి 2019 వరకు వీరిద్దరు డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకున్నారు. అలానే వీరిద్దరి మధ్య మంచి అనుబంధం కూడా ఉంది. ముఖ్యంగా విరాట్.. చాలా సందర్భాల్లో మహీపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Kohli Dhoni IPL 2023 : ఇక ఈ ఐపీఎల్ సీజన్ విషయానికొస్తే.. ధోనీ కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ ఐదోసారి టైటిల్‌ను ముద్దాడింది. ఫైనల్లో గుజరాత్టైటాన్స్పై గెలిచింది. ఇక కోహ్లీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గ్రూప్ స్టేజ్ నుంచే నిష్క్రమించింది. పాయింట్ల పట్టికలో ఆరు స్థానంతో సరిపెట్టుకుంది. కానీ విరాట్ మాత్రం 639 పరుగులు చేశాడు. అందులో రెండు సెంచరీలు కూడా ఉన్నాయి.
ఇదీ చూడండి :
'ఆసియా కప్'పై కొనసాగుతున్న రగడ.. పాక్ లేకుండానే పోరుకు సిద్ధం!
మహిళా క్రికెటర్‌తో రుతురాజ్ వివాహం.. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా?