ETV Bharat / sports

రిటైర్మెంట్​లోనూ వీడని ఫ్రెండ్​షిప్.. సరిగ్గా మూడేళ్ల కిందట ఇదే రోజు.. - అంతర్జాతీయ క్రికెట్​కు ధోనీ గుడ్​బై

MS Dhoni And Suresh Raina Retirement : మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ, టీమ్​ఇండియా బ్యాటర్ సురేశ్ రైనా మంచి స్నేహితులు. వీరిద్దరూ తమ స్నేహబంధం గురించి పలు వేదికలపై మాట్లాడారు. అయితే ధోనీ, రైనా సరిగ్గా మూడేళ్ల క్రితం ఇదే తేదీన (ఆగస్టు 15) వారి జీవితంలో ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. దాని గురించే ఈ కథనం..

MS Dhoni And Suresh Raina Retirement
MS Dhoni And Suresh Raina Retirement
author img

By

Published : Aug 15, 2023, 2:46 PM IST

MS Dhoni And Suresh Raina Retirement : సరిగ్గా 3 ఏళ్ల కిందట ఇద్దరు భారత స్టార్‌ క్రికెటర్లు రిటైర్మెంట్​ ప్రకటించారు. ఒకరేమో టీమ్​ఇండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ కాగా.. మరొకరు సురేశ్ రైనా. వీరిద్దరూ 2020 ఆగస్ట్ 15న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. తొలుత ధోనీ రిటైర్మెంట్​ నిర్ణయం ప్రకటించగా.. ఆ తర్వాత రైనా కూడా ఆటకు గుడ్​బై చెప్పాడు. ఈ క్రమంలో తన సోదర సమానుడైన ధోనీ రిటైర్మెంట్ ఇచ్చిన రోజే.. రైనా కూడా ఆటకు వీడ్కోలు పలికాడని నెటిజన్లు సోషల్ మీడియాలో అప్పట్లో కామెంట్లు పెట్టారు.

టీమ్​ఇండియాకు అంతర్జాతీయ ట్రోఫీలు అందించిన ధోనీ..
MS Dhoni Raina CSK Team : టీమ్‌ఇండియాలోనే కాకుండా ఇండియన్ ప్రీమియర్‌ లీగ్​లో చెన్నై సూపర్​కింగ్స్ తరఫున మహేంద్ర సింగ్ ధోనీ, సురేశ్​ చాలా ఏళ్లపాటు కలిసి ఆడారు. ధోనీ నాయకత్వంలోనే భారత్‌ 2007లో టీ20 వరల్డ్‌ కప్, 2011లో వన్డే ప్రపంచకప్‌లతోపాటు ఛాంపియన్స్‌ ట్రోఫీని (2013) గెలిచింది. అయితే.. ధోనీ ఇంకా ఐపీఎల్​లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతుండగా.. సురేశ్‌ రైనా మాత్రం గతేడాది ఐపీఎల్‌, దేశవాళీ క్రికెట్‌కు గుడ్​బై చెప్పాడు.

ధోనీ-రైనా స్నేహబంధం..
MS Dhoni And Suresh Raina Friendship : ధోనీ, రైనా స్నేహబంధం కేవలం మైదానంలోనే కాకుండా వ్యక్తిగతంగానూ బలమైందే. అందుకే.. చెన్నై క్రికెట్ అభిమానులు ధోనీని 'తలా' అని.. రైనాని 'చిన్న తలా'గా అని పిలుస్తారు. ఐపీఎల్‌లో సీఎస్‌కే విజయవంతంగా కొనసాగడానికి కెప్టెన్ కూల్ ధోనీతోపాటు రైనా పాత్ర కూడా చాలా కీలకమని క్రికెట్​ మాజీలు అంటుంటారు. ఇలాంటి ఇద్దరు దిగ్గజ క్రికెటర్లు ఒకే రోజు క్రికెట్‌కు వీడ్కోలు పలకడం.. అదీ కూడా స్వాతంత్ర్య దినోత్సవం రోజునే కావడం విశేషం.

2023 ఐపీఎల్ విజేత..

2023 Indian Premier League Winner : 2023 ఐపీఎల్ సీజన్​లో కూడా తన కూల్ కెప్టెన్సీతో మహేంద్ర సింగ్ ధోనీ ఔరా అనిపించుకున్నాడు. గుజరాత్​తో జరిగిన ఫైనల్ మ్యాచ్​లో తన కెప్టెన్సీతో ఆకట్టుకున్నాడు. ఈ ఏడాది మరో టైటిల్ చెన్నై ఖాతాలో పడేటట్లు చేశాడు.

'ఫ్యాన్స్​కు గిఫ్ట్ ఇస్తా.. కష్టమైనా వచ్చే సీజన్​లో ఆడతా'.. రిటైర్మెంట్​పై ధోనీ క్లారిటీ

MS Dhoni 2011 Bat Price : ధోనీ క్రేజ్ అట్లుంటది మరి.. ఆ విన్నింగ్ షాట్ బ్యాట్‌ ధర రూ. 83 లక్షలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.