ETV Bharat / sports

IPL 2021: ఆస్ట్రేలియా క్రికెటర్లు వచ్చేస్తున్నారు! - ఐపీఎల్ వార్నర్

ద్వైపాక్షిక సిరీస్​ల కారణంగా యూఏఈలో జరగబోయే ఐపీఎల్​ మిగిలిన మ్యాచ్​ల్లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు పాల్గొనడం అనుమానం అంటూ వార్తలు వచ్చాయి. అయితే అదే యూఏఈలో టీ20 ప్రపంచకప్ నిర్వహిస్తుండటం వల్ల లీగ్​కు రావడమే మంచిదని భావిస్తున్నారట ఆసీస్ క్రికెటర్లు. అదే బాటలో ఇంగ్లాండ్​ ఆటగాళ్లు కూడా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Australian players
ఆస్ట్రేలియా
author img

By

Published : Jul 1, 2021, 4:35 PM IST

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ రెండో దశ సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతున్నాయి! వేదికలు, తేదీలపై స్పష్టత వచ్చేసింది. టీ20 ప్రపంచకప్‌ను యూఏఈలో నిర్వహిస్తామని బీసీసీఐ, ఐసీసీ రెండురోజుల క్రితమే స్పష్టం చేశాయి. దాంతో విదేశీ ఆటగాళ్లు రెండో దశ ఐపీఎల్‌ ఆడేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. తాజాగా ఆస్ట్రేలియా క్రికెటర్లు దుబాయ్‌ వచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం.

ఐపీఎల్‌ రెండో దశ సమయంలో ఆస్ట్రేలియాకు ద్వైపాక్షిక సిరీసులు ఉన్నాయి. వ్యక్తిగత, ఇతర కారణాలతో వాటికి అందుబాటులో ఉండలేమని కొందరు ఆటగాళ్లు చెప్పేశారు. దాదాపు 20 మంది ఐపీఎల్‌ ఆటగాళ్లలో తొమ్మిది మంది మాత్రమే బంగ్లా, వెస్టిండీస్‌ పర్యటనకు వస్తామని చెప్పారట. దాంతో గ్లెన్‌ మ్యాక్స్​వెల్, జే రిచర్డ్‌సన్‌, కేన్‌ రిచర్డ్‌సన్‌, మార్కస్‌ స్టొయినిస్‌, డేనియెల్‌ సామ్స్‌ తదితరులు ఐపీఎల్‌కు వస్తారని తెలిసింది.

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ యూఏఈలో జరుగుతుండటం వల్ల ఆస్ట్రేలియా క్రికెట్‌ సంఘం ఆలోచనలో పడిందని సమాచారం. వారిని అడ్డుకోకుండా ఉండటమే మంచిదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌ ఆటగాళ్లు ఐపీఎల్‌ ఆడేందుకు వస్తామని గతంలోనే చెప్పారు. ఇందుకోసమే కరీబియన్‌ లీగ్‌ను కూడా ముందుకు జరిపారు. ఇప్పుడు ఆసీస్‌ క్రికెటర్లలో చాలామంది వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డును బీసీసీఐ ఒప్పించే పనిలో పడిందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అన్నీ ,కుదిరితే ఆంగ్లేయులూ రావడంలో సందేహమేమీ లేదు!

ఇవీ చూడండి: BCCI ప్రపోజల్​కు ఇంగ్లాండ్​ బోర్డు అంగీకారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.