ETV Bharat / sports

నెం.1 ర్యాంకును కోల్పోయిన సిరాజ్​.. గ్రౌండ్​లోనే మండిపడ్డ రోహిత్, కోహ్లీ! - kohli fire on kuldeep

ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్​లో మహ్మద్​ సిరీజ్​ తన నెం.1 స్థానాన్ని కోల్పోయాడు. అలాగే ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో కెప్టెన్​ రోహిత్ శర్మ, కోహ్లీ.. కుల్దీప్​ యాదవ్​పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ వీడియోను చూసేయండి..

Mohammed Siraj slips from top spot to third in ICC rankings for bowlers in ODIs
నెం.1 ర్యాంకును కోల్పోయిన సిరాజ్​.. గ్రౌండ్​లోనే కోపంతో ఊగిపోయిన రోహిత్, కోహ్లీ
author img

By

Published : Mar 22, 2023, 5:21 PM IST

టీమ్​ఇండియా స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ వన్డేల్లో తన నెం.1 ర్యాంక్‌ను కోల్పోయాడు. అంతర్జాతీయ క్రికెట్​ కౌన్సిల్​ తాజాగా ప్రకటించిన బౌలర్ల ర్యాంకింగ్స్‌లో.. సిరాజ్‌ను వెనక్కినెట్టి ఆస్ట్రేలియా స్టార్‌ బౌలర్‌ జోష్‌ హెజిల్‌వుడ్‌ అగ్రస్థానానికి చేరుకున్నాడు. విశాఖపట్నం వేదికగా కంగారులతో జరిగిన రెండో వన్డేలో 3 ఓవర్లలోనే 37 పరుగులు సమర్పించుకున్న సిరాజ్‌.. రెండు స్థానాలు కిందకి పడిపోయి మూడో ర్యాంకులో నిలిచాడు.

ఈ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో హాజిల్‌వుడ్‌ 713 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా.. న్యూజిలాండ్‌ స్టార్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ 708 పాయింట్లుతో రెండో స్థానంలో నిలిచాడు. సిరాజ్‌ 702 పాయింట్లతో.. ఆసీస్‌ స్టార్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌తో కలిసి మూడో ర్యాంకును పంచుకున్నాడు. ప్రస్తుతం చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో సిరాజ్‌ రాణించలేకపోయాడు. ఇంకా ఒక్క వికెట్​ కూడా తీయలేదు.

కుల్దీప్​పై మండిపడ్డ రోహిత్​, కోహ్లీ​.. ఇక ప్రస్తుతం జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో టీమ్​ఇండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య, కుల్దీప్‌ యాదవ్‌ అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నారు. వీరిద్దరు ఇప్పటివరకు తలో మూడు వికెట్లు తీసి ఫ్యాన్స్​ను ఆకట్టుకున్నారు. అక్షర్‌ పటేల్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. అయితే ఈ మ్యాచ్‌లో కుల్దీప్‌ యాదవ్‌పై కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు విరాట్‌ కోహ్లీ అసహనం వ్యక్తం చేశారు. మైదానంలోనే కాస్త కోపంతో కనిపించారు. ఎందుకంటే.. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ 25 ఓవర్‌ వేసిన కుల్దీప్‌ యాదవ్‌.. మూడో బంతికి ఆసీస్​ ప్లేయర్​ డేవిడ్‌ వార్నర్‌ను ఔట్ చేశాడు. అనంతరం నాలుగో బంతిని అద్భుతమైన గూగ్లీగా వేశాడు. ఈ క్రమంలోనే ఆ బంతి క్రీజులోకి వెళ్లి అలెక్స్ క్యారీ ప్యాడ్‌కు తాకింది. దీంతో కుల్దీప్​తో పాటు రోహిత్‌, కోహ్లీ ఎల్బీకీ అప్పీలు చేశారు. కానీ ఫీల్డ్‌ అంపైర్‌ నితిన్‌ మేనన్‌ మాత్రం నాటౌట్​గా ప్రకటించాడు. ఈ క్రమంలోనే కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వికెట్‌ కీపర్‌ ఇషాన్‌ కిషన్‌, స్లిప్‌లో ఉన్న విరాట్ కోహ్లీతో చర్చలు జరిపాడు. అనంతరం రివ్యూ తీసుకునేందుకు సిద్దమయ్యాడు. అయితే బౌలర్‌ కుల్దీప్‌ మాత్రం రోహిత్‌ నిర్ణయాన్ని తిరస్కరించినట్లుగా మళ్లీ బౌలింగ్‌ వేసేందుకు తన స్థానానికి వెళ్లి సిద్ధమైపోయాడు. దీంతో కుల్దీప్‌పై హిట్​మ్యాన్, విరాట్​.. కాస్త మండిపడినట్లుగా కనిపించారు. అయితే తర్వాతి రిప్లేలో బంతి లెగ్‌ స్టంప్‌ను తాకినట్లు కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఇదీ చూడండి: IND VS AUS: హార్దిక్​ సూపర్​ బౌలింగ్​.. పాపం స్మిత్, మార్ష్​.. మిడిల్​ స్టంప్​ గాల్లోకే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.