ETV Bharat / sports

IND VS SL: పాటలు పాడి అలరించిన సిరాజ్-ఇషాన్ కిషన్

author img

By

Published : Feb 26, 2022, 7:14 PM IST

టీమ్​ఇండియా-శ్రీలంక రెండో టీ20 ధర్మశాలలో జరుగుతుంది. అయితే స్టేడియానికి చేరే క్రమంలో భారత క్రికెటర్లు, బస్సులో పాటలు పాడుతూ కనిపించారు.

Siraj, Ishan Kishan
సిరాజ్ ఇషాన్ కిషన్

శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్ కోసం టీమ్‌ఇండియా ధర్మశాలకు చేరుకుంది. లఖ్‌నవూ మైదానం నుంచి ఎయిర్‌పోర్ట్‌కు ఆటగాళ్లను బీసీసీఐ బస్సులో తరలించింది. అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో ధర్మశాలకు చేర్చింది. ఈ సందర్భంగా బస్సులో భారత క్రీడాకారులు ఆడుతూ పాడుతూ సరదాగా గడిపారు. అందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్వీట్ చేసింది. ఇందులో టీమ్ఇండియా ఫాస్ట్‌ బౌలర్‌ మహమ్మద్‌ సిరాజ్, ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్, స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ పలు బాలీవుడ్‌ పాటలు పాడారు.

ఇప్పటికే తొలి టీ20 మ్యాచ్‌లో విజయం సాధించిన టీమ్‌ఇండియా మూడు టీ20ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించి సిరీస్‌ను పట్టేయాలని రోహిత్​సేన భావిస్తోంది. మరోవైపు సిరీస్‌ బరిలో నిలబడాలంటే శ్రీలంక తప్పకుండా గెలుపొందాలి. మొదటి మ్యాచ్‌లో బౌలింగ్‌, బ్యాటింగ్‌ విభాగాల్లో విఫలం కావడం వల్ల లంక పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లోనైనా పుంజుకొని విజయం సాధించాలని పట్టుదలతో ఉంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.