Mohammad Shami Covid Positive : ప్రస్తుతం టీమ్ ఇండియాలో అనుభవం కలిగిన బౌలర్లలో మహమ్మద్ షమీ ముందు వరుసలో ఉంటాడు. అయితే ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు షమీని స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపికచేయడం విమర్శలకు దారి తీసింది. ఒక నాణ్యమైన బౌలర్‌ను ఇలా స్టాండ్ బై ప్లేయర్‌గా ఉంచడం ఎంతవరకు సమంజసమని అభిమానులు మండిపడ్డారు.
గాయాలతో జట్టుకు దూరమైన బుమ్రా, హర్షల్ పటేల్‌లు టీ20 ప్రపంచకప్‌కు ఎంపికైనప్పటికీ... ఎంతవరకు రాణిస్తారనేది ప్రశ్నార్థకమే. అనుభవం దృష్యా బుమ్రా మంచి బౌలర్ కావొచ్చు.. కానీ గాయం తర్వాత తిరిగొస్తున్నాడు.. అతను ఎలా ఆడతాడనేది ఇప్పుడే చెప్పలేం. హర్షల్ పటేల్‌ది ఇదే పరిస్థితి. ఇలాంటి సమయంలో షమీని తుది జట్టులో చోటు ఇవ్వాల్సింది పోయి స్టాండ్ బై ప్లేయర్‌గా ఉంచడం ఏంటని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. షమీ విషయంలో పరోక్షంగా బీసీసీఐని తప్పుబట్టారు.
ఇదిలా ఉంటే స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు మహ్మద్ షమీని ఎంపిక చేసింది బీసీసీఐ. ఇది మంచి పరిణామం అని అనుకునేలోపే కరోనా పాజిటివ్‌గా తేలడం వల్ల షమీ.. ఈ టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. అయితే షమీకి సౌతాఫ్రికాతో జరగనున్న టీ20 సిరీస్‌తో మరో అవకాశం ఉంది. మరి షమీ ఆ సిరీస్‌లో ఆడతాడా లేక ఇంకేమైనా జరిగి సౌతాఫ్రికాతో సిరీస్‌కు దూరమవుతాడా అని అతడి అభిమానులు సందేహాం వ్యక్తం చేస్తున్నారు. అయితే షమీ స్థానంలో టీమ్ ఇండియా సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్ జట్టులోకి రానున్నట్లు సమాచారం. ఇది నిజమైతే మాత్రం ఉమేశ్ యాదవ్.. మళ్లీ మూడేళ్ల తర్వాత టీ20ల్లో రీఎంట్రీ ఇవ్వనున్నాడు.
ఇవీ చదవండి: 'నా భర్తను చాలా మిస్సవుతున్నా'.. అనుష్క శర్మ ఎమోషనల్ పోస్ట్ వైరల్!