ETV Bharat / sports

టీ20ల్లో ఆ​ రికార్డ్​ సాధించిన తొలి క్రికెటర్​గా రిజ్వాన్​!

Mohammad Rizwan T20 Record: పాకిస్థాన్ ఓపెనర్​ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్​ అరుదైన ఫీట్​ సాధించాడు. వెస్టిండీస్​తో చివరి టీ20 మ్యాచ్​లో భాగంగా ఒకే ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన ఘనతను సొంతం చేసుకున్నాడు.

mohammad rizwan
మహ్మద్ రిజ్వాన్
author img

By

Published : Dec 17, 2021, 10:19 AM IST

Mohammad Rizwan T20 Record: పాకిస్థాన్​ వికెట్​కీపర్ బ్యాట్స్​మన్ మహ్మద్ రిజ్వాన్ అరుదైన రికార్డు సాధించాడు. టీ20ల్లో ఒక క్యాలెండర్​ ఇయర్​లో 2000 పరుగులు చేసిన మొదటి క్రికెటర్​గా నిలిచాడు.

వెస్టిండీస్​తో టీ20 సిరీస్​లో భాగంగా ఈ ఘనత సాధించాడు రిజ్వాన్. కరాచీ వేదికగా జరిగిన చివరి టీ20 మ్యాచ్​ 11వ ఓవల్లో రిజ్వాన్ ఈ మైలురాయిని అందుకున్నాడు.

మూడో టీ20లో.. తొలుత బ్యాటింగ్​ చేసిన వెస్టిండీస్​ 207 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం ఛేదనలో పాక్​ ఓపెనర్లు బాబర్ ఆజామ్, రిజ్వాన్​ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. పాక్ సారథి బాబర్ ఆజామ్(79), రిజ్వాన్(86) పరుగులు చేసి తొలి వికెట్​కు 158 భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో, వెస్టిండీస్​ను 3-0తో క్లీన్​ స్వీప్​ చేసింది పాక్.

వన్డే సిరీస్ వాయిదా

మూడు మ్యాచ్​ల వన్డే సిరీస్​ను వాయిదా వేస్తున్నట్లు పాకిస్థాన్, వెస్టిండీస్​ క్రికెట్ బోర్డులు ప్రకటించాయి. ఆటగాళ్ల శిబిరంలో కరోనా కేసులు పెరుగుతుండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నాయి. గురువారం మూడు మ్యాచ్​ల టీ20 సీరీస్​ పూర్తయిన తర్వాత ఇరుదేశాల క్రికెట్ బోర్డులు ఈ మేరకు ప్రకటన చేశాయి. వచ్చే ఏడాది జూన్​లో మళ్లీ రీషెడ్యూల్ చేయనున్నట్లు వెల్లడించాయి.

ఇదీ చదవండి:

PAK VS NAM T20: కోహ్లీ రికార్డును తిరగరాసిన బాబర్ అజామ్

ఐసీయూ నుంచి వచ్చి హాఫ్ సెంచరీ.. రిజ్వాన్​పై ప్రశంసలు

భారతీయ వైద్యుడికి జెర్సీ బహుకరించిన పాక్ క్రికెటర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.