భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెట్ మొహమ్మద్ కైఫ్.. అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి చాలా ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటి తరం యువ క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రీతిలో కళ్లు చెదిరే క్యాచ్ పట్టుకున్నాడు. బుల్లెట్‌లా దూసుకెళ్తున్న బంతిని అమాంతం గాల్లోకి ఎగిరిదూకి.. ఒక్కచేతితో అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు.
ఆ క్యాచ్‌తో ఒక్కసారిగా కైఫ్ తన పాత రోజులను గుర్తు చేశాడు. ప్రస్తుతం కైఫ్ పట్టిన సూపర్ సింగిల్ హ్యాండెడ్ క్యాచ్ వీడియో.. సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఇలాంటి ఫిట్‌నెస్ ఉంచుకుని అనవసరంగా రిటైర్మెంట్ ఇచ్చాడంటూ క్రికెట్ అభిమానులు అంటున్నారు.
-
Mohammad Kaif and one-handed stunners 🤝🤯
— ESPNcricinfo (@ESPNcricinfo) March 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
📹 courtesy @LLCT20 #LLCT20 #LLCMasters #CricketTwitter pic.twitter.com/3WWMZcWPOB
">Mohammad Kaif and one-handed stunners 🤝🤯
— ESPNcricinfo (@ESPNcricinfo) March 18, 2023
📹 courtesy @LLCT20 #LLCT20 #LLCMasters #CricketTwitter pic.twitter.com/3WWMZcWPOBMohammad Kaif and one-handed stunners 🤝🤯
— ESPNcricinfo (@ESPNcricinfo) March 18, 2023
📹 courtesy @LLCT20 #LLCT20 #LLCMasters #CricketTwitter pic.twitter.com/3WWMZcWPOB
సౌరభ్ గంగూలీ కెప్టెన్‌గా ఉన్న సమయంలో టీమ్ఇండియా జట్టులోకి వచ్చాడు కైఫ్. యువరాజ్ సింగ్‌తో కలిసి ఇంగ్లాండ్‌లో అతడు ఆడిన ఇన్నింగ్స్ ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు. అయితే.. కైఫ్ అంటే మాత్రం అందరికీ గుర్తుకు వచ్చేది ఫీల్డింగ్. అప్పటి జట్టులో కైఫ్ అద్భుతమైన ఫీల్డర్. ఎలాంటి క్యాచ్‌లనైనా డైవ్ చేస్తూ పట్టుకోవడంతో కైఫ్ సూపర్. సూపర్ ఫీల్డింగ్‌తో పరుగులు ఆపాలన్న, రనౌట్లు చేయాలన్న కైఫ్ తర్వాతే ఎవరైనా. తన స్నేహితుడు యువరాజ్ సింగ్ కూడా కైఫ్‌కు ఫీల్డింగ్‌లో గట్టి పోటీ ఇచ్చేవాడు. వీళ్లిద్దరూ జట్టులో ఉంటే.. ప్రత్యర్థికి 20, 30 పరుగులు తగ్గినట్లే. అలాంటి ఫీల్డింగ్‌తో టీమ్ఇండియా పెద్ద అసెట్‌గా ఉండేవాళ్లు.
అయితే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న తర్వాత కామెంటేటర్‌గా, కోచ్‌గా వ్యవహరిస్తున్న కైఫ్ తాజాగా.. లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో ఆడుతున్నాడు. శనివారం రాత్రి ఇండియా మహరాజాస్-ఆసియా లయన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కైఫ్.. ఈ సంచలన క్యాచ్ అందుకున్నాడు. ఓజా వేసిన వేసిన ఇన్నింగ్స్ 9వ ఓవర్ ఐదో బంతిని శ్రీలంక మాజీ క్రికెటర్ తరంగా కట్ షాట్ ఆడాడు. ఆ బంతిని కైఫ్ తన కుడివైపుకు డైవ్ చేస్తూ.. సింగిల్ హ్యాండ్‌తో క్యాచ్ అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కైఫ్ మొత్తం మూడు క్యాచ్‌లు అందుకున్నాడు. ఈ క్యాచ్‌తో కైఫ్‌లో ఇంకా వేడి తగ్గలేదని, వయసుతో కైఫ్‌కు సంబంధం లేదంటూ నెటిజన్లు సరదాగా కామెంట్ చేస్తున్నారు.
కాగా, శనివారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఇండియా మహరాజాస్.. 85 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో ఫైనల్ అవకాశాలు చేజార్చుకుంది. సోమవారం.. ఆసియా లయన్, వరల్డ్ జెయింట్ల మధ్య ఫైనల్ జరగనుంది.