ETV Bharat / sports

టీమ్‌ఇండియాను లాడ్లాస్ అని ఎందుకంటారంటే

ఆసియాకప్​ 2022లో బిజీగా ఉన్న టీమ్‌ఇండియాపై పాక్‌ మాజీ కెప్టెన్‌ మహమ్మద్‌ హఫీజ్‌ కామెంట్స్​ చేశాడు. ఏమన్నాడంటే

teamindia
టీమ్​ఇండియా
author img

By

Published : Sep 3, 2022, 11:14 AM IST

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత సంపన్న బోర్డు బీసీసీఐ. సంపదను సృష్టించడంలో బీసీసీఐకి సాటి మరేదీ రాదు. ఆటగాళ్లకు చెల్లించే భత్యాలూ భారీగానే ఉంటాయి. ఈ క్రమంలో టీమ్‌ఇండియాపై పాక్‌ మాజీ కెప్టెన్‌ మహమ్మద్‌ హఫీజ్‌ పొగడ్తల వర్షం కురిపించాడు. "నాకు ఎక్కువ విషయాలు తెలియవు కానీ.. ఒకటి మాత్రం బాగా తెలుసు. సమాజంలో ఎవరు ఎక్కువ సంపాదిస్తారో వారిని ప్రతి ఒక్కరూ ప్రేమిస్తారు. వారికే ఎక్కువ అభినందనలు వస్తుంటాయి" అని తెలిపాడు.

"టీమ్‌ఇండియా రెవెన్యూను సృష్టించే దేశం. ప్రపంచంలో ఎక్కడ ద్వైపాక్షిక సిరీస్‌ జరిగినా.. భారత్‌ స్పాన్సర్‌ చేస్తే మాత్రం జాక్‌పాట్‌ కొట్టినట్లే. ఇలాంటి విషయాలను ఎవరూ కాదనలేరు. అందుకే టీమ్‌ఇండియాను లాడ్లాస్ అని పిలుస్తా. ఎందుకంటే సంపదను వృద్ధి చేయడంలో బీసీసీఐకి సాటి మరేదీ లేదు" అని మహమ్మద్‌ హఫీజ్‌ అన్నాడు. కాగా, లాడ్లాస్​ అంటే ప్రియమైనది. ప్రేమించబడేది అని అర్థాలు వస్తాయి. ప్రస్తుతం ఆసియా కప్‌లో భారత్‌, పాక్‌ రెండోసారి తలపడనున్నాయి. ఆదివారం సూపర్‌-4 దశలో భాగంగా దాయాదుల పోరును చూడొచ్చు.

ఇదీ చూడండి: యుఎస్‌ ఓపెన్‌లో సెరెనా విలియమ్స్ ఓటమి.. ఆటకు వీడ్కోలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.