పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై(PCB News) బ్యాట్స్‌మన్ మహ్మద్ హఫీజ్ నిరాశ చెందాడని వెటరన్ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ అంటున్నాడు. యూఏఈ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు(ICC T20 WorldCup 2021) ముందు హఫీజ్ రిటైర్మెంట్(Mohammad Hafeez Retirement) ప్రకటించే అవకాశం ఉందని తెలిపాడు. అయితే జట్టులోని సీనియర్ ఆటగాళ్లతో ఏ విధంగా వ్యవహరించాలో పాక్ బోర్డుకు తెలియడం లేదని విమర్శించాడు. హఫీజ్(Kamran Akmal on Hafeez) లాంటి వెటరన్ ఆటగాళ్లంతా పీసీబీ తీరుతో అసంతృప్తితో ఉన్నారని కమ్రాన్ అక్మల్ అన్నాడు.
"నేను మహ్మద్ హఫీజ్‌తో మాట్లడలేదు.. కానీ, ప్రస్తుతం అతడు ఎంతో బాధను అనుభవిస్తున్నాడు. నాకు తెలిసి అతడు టీ20 ప్రపంచకప్ ఆడకపోవచ్చు. ఒకవేళ ఈ పొట్టి ఫార్మాట్ ప్రారంభానికి ముందే హఫీజ్ రిటైర్మెండ్ కూడా ప్రకటించవచ్చు. అతడు పూర్తిగా నిరాశలో కనిపిస్తున్నాడు. అనుభవజ్ఞుడైన ఆటగాడిని ట్రీట్ చేసే విధానం ఇది కాదు".
- కమ్రాన్ అక్మల్, పాకిస్థాన్ మాజీ క్రికెటర్
సెప్టెంబరు 18నుంచి జరగనున్న కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో(Caribbean Premier League 2021) ఆడేందుకు పీసీబీ నుంచి హఫీజ్‌కు నిరభ్యంతర పత్రం లభించింది. కానీ, న్యూజిలాండ్‌తో సెప్టెంబరు 16 నుంచి ప్రారంభం కానున్న సిరీస్ కోసం సీనియర్ ఆటగాళ్లను పీసీబీ వెనక్కి రప్పిస్తుంది. అయితే కొన్ని రోజులు ఆగిన తర్వాత పాకిస్థాన్ వస్తానన్న హఫీజ్ అభ్యర్థనను పీసీబీ తిరస్కరించడం గమనార్హం.
హఫీజ్ అభ్యర్థనను పీసీబీ తిరస్కరించడంపై కమ్రాన్ అక్మల్ స్పందించాడు. "ఇది సరైన పద్దతి కాదు. నేను హఫీజ్ ఒక్కడి గురించే కాదు.. పాకిస్థాన్ క్రికెట్ గురించి మాట్లాడుతున్నాను. దీని వల్ల మన దేశ క్రికెట్‌కు భంగం వాటిల్లే అవకాశం ఉంది. ఇదే పరిస్థితి నాకూ ఏదురైంది. హఫీజ్‌కు జరిగింది మాత్రం పెద్ద తప్పు. ఇప్పటికే అతడికి నిరభ్యంతర పత్రం ఇచ్చేశారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో విమాన ప్రయాణ ఖర్చు ఎంత అవుతుందో.. బయోబబుల్‌లో ఎలా ఉండాలో ఒకసారి అలోచించండి" అని కమ్రాన్ అక్మల్ అభిప్రాయపడ్డాడు.
పీసీబీకి నూతన ఛైర్మన్‌గా(PCB New Chairman 2021) ఎన్నికైన రమీజ్ రాజా(Ramiz Raja PCB).. జట్టులోని పరిస్థితులను అర్థం చేసుకోవాలని కమ్రాన్ అక్మల్ సూచించాడు. హఫీజ్ లాంటి సీనియర్ ఆటగాళ్లను నిరాశకు గురిచేయకుండా.. వాళ్లకు మద్దతుగా నిలవాలని రమీజ్ రాజాను కోరాడు.
ఇదీ చూడండి.. IPL 2021: కొత్త జెర్సీలో ఆర్సీబీ.. ఎందుకంటే?