ETV Bharat / sports

'రోహిత్-విరాట్ వివాదం.. బ్రేక్​ తీసుకున్న సమయమే తప్పు'

Azharuddin on Rohit Virat Captaincy: టీమ్​ఇండియా కెప్టెన్లు రోహిత్ శర్మ, విరాట్​ కోహ్లీ మధ్య వివాదం మరింత ముదురుతోంది! భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటన నేపథ్యంలో రోహిత్​ టెస్టు సిరీస్​కు దూరమవడం, విరాట్ వన్డేలకు దూరమవుతుండటం ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీనిపై టీమ్​ఇండియా మాజీ సారథి అజారుద్దీన్ ఏమన్నాడంటే!

rohit sharma, virat kohli
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ
author img

By

Published : Dec 14, 2021, 3:57 PM IST

Azharuddin on Rohit Virat Captaincy: టీమ్​ఇండియా.. దక్షిణాఫ్రికా పర్యటన నేపథ్యంలో భారత జట్టు కెప్టెన్ల నిర్ణయాలు చర్చనీయాంశంగా మారాయి. ఓవైపు టీ20, వన్డే జట్టు సారథి రోహిత్ శర్మ.. ప్రాక్టీస్​ సెషన్​లో గాయం కారణంగా టెస్టు సిరీస్​కు హాజరుకాలేనని చెప్పాడు. మరోవైపు టెస్టు కెప్టెన్ విరాట్​.. వ్యక్తిగత కారణాల వల్ల వన్డే సిరీస్​ నుంచి తప్పుకొంటున్నట్లు మేనేజ్​మెంట్​కు చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రోహిత్- విరాట్​ కోహ్లీకి పడట్లేదని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై మాజీ సారథి అజారుద్దీన్ స్పందించాడు. ట్విట్టర్​ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.

"వన్డే సిరీస్​కు ప్రాతినిధ్యం వహించలేనని విరాట్ కోహ్లీ చెప్పాడు. గాయం కారణంగా టెస్టు సిరీస్​లో పాల్గొనట్లేదని రోహిత్ స్పష్టం చేశాడు. బ్రేక్​ తీసుకోవడంలో తప్పేమీలేదు. కానీ, వారు విరామం తీసుకున్న సమయమే తప్పు. ఒకేసారి ఇరువురి నిర్ణయం వల్ల.. వారి మధ్య వివాదం నిజంగానే ఉందేమో? అనే అనుమానం మరింత ఎక్కువ అయ్యేలా ఉంది."

--అజారుద్దీన్, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్.

టీమ్​ఇండియా టెస్టు జట్టు వైస్​ కెప్టెన్ రోహిత్​ శర్మ స్థానంలో ప్రియాంక్ పాంచాల్​ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ పేర్కొంది. మూడు మ్యాచ్​ల టెస్టు సిరీస్​లో పాంచాల్​ బ్యాకప్ ఓపెనర్​గా సేవలందించనున్నాడు. మయాంక్, గిల్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది.

భారత జట్టు, దక్షిణాఫ్రికా మధ్య డిసెంబర్ 26 నుంచి టెస్టు సిరీస్​ ప్రారంభం కానుంది. ఈ సిరీస్​ ముగిశాక ఇరు జట్లు మూడు వన్డేల సిరీస్​లో తలపడతాయి.

ఇదీ చదవండి:

IND vs SA Series: వన్డే సిరీస్​కు కోహ్లీ దూరం.. ఫ్యాన్స్​లో అనుమానాలు!

PAK vs WI: రికార్డు తిరగరాసిన పాక్.. టీ20ల్లో తొలి జట్టుగా!

'రాయుడిని అందుకే తీసుకోలేదు.. కెప్టెన్ సమక్షంలోనే జట్టు ఎంపిక'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.