ETV Bharat / sports

బ్యాటింగ్​లో​ నా ఫేవరెట్​ విరాట్​ కోహ్లీ.. బౌలింగ్​లో మాత్రం వాళ్లు.. : పాక్​ పేసర్​ అమీర్

Mohammad Amir Virat Kohli : పాకిస్థాన్​ క్రికెట్​ ప్లేయర్​ మహ్మద్​ అమీర్​ తనకిష్టమైన ముగ్గురు ఫేవరెట్​ బ్యాటర్లతో పాటు బౌలర్ల పేర్లను వెల్లడించాడు. ఈ లిస్ట్​లో కింగ్​ విరాట్​ కోహ్లీతో పాటు టీమ్​ఇండియా మరో స్టార్​ ఆటగాడు కూడా ఉండగా.. ఆ మిగతా ప్లేయర్స్ ఎవరంటే ?

Pakistan Pacer Mohd Amir Top 3 Batters And Bowlers List
బ్యాటింగ్​లో వీరు.. బౌలింగ్​లో వారే నా ఫేవరేట్​.. టాప్​లో కింగ్​ కోహ్లీ.. : పాక్​ పేసర్​ అమీర్​
author img

By

Published : Jun 27, 2023, 2:29 PM IST

Mohammad Amir And Virat Kohli Friendship : పాకిస్థాన్​ ఇండియాల మధ్య మ్యాచ్​ అంటేనే అందరికీ ఎక్కడ లేని హుషారు వస్తుంది . క్రికెట్​ అంటే ఇష్టం లేని వారు కూడా ఈ ఇరు జట్ల మధ్య మ్యాచ్​ అంటే టీవీలకు అతుక్కుపోతారు. ఆ విధంగా హోరాహోరీగా సాగుతుంది ఈ మ్యాచ్​. కొన్ని సందర్భాల్లో మైదానంలోనే ఆటగాళ్లు గొడవలకు దిగడం సహజం. ఆట నుంచి బయటకు వచ్చాక అంతా మామూలే. స్నేహ పూర్వకంగా ఒకరినొకరు పలకరించుకుంటారు. అయితే పాక్‌ ఫాస్ట్‌బౌలర్‌ మహ్మద్‌ అమీర్ , టీమ్‌ఇండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్ కోహ్లీ కూడా మంచి ఫ్రెండ్స్‌. కోహ్లీని పలు సందర్భాల్లో అమీర్‌ ప్రశంసించడమే కాకుండా అతనిపైనున్న అభిమానాన్ని కూడా పలు సందర్భాల్లో చాటుకున్నాడు. తాజాగా ఈ పాకిస్థానీ పేసర్​ తనకిష్టమైన టాప్​-3 ఫేవరెట్​ బ్యాటర్ల పేర్లను చెప్పుకొచ్చాడు. కింగ్​ విరాట్​ కోహ్లీతో పాటు పాక్​ సారథి బాబర్​ అజామ్​, ఇండియా యువ ఆటగాడు శుభ్​మిన్​ గిల్​ ఉండగా.. ఈ ముగ్గురిలో ఇద్దరు టీమ్​ఇండియా ఆటగాళ్లే కావడం విశేషం.

"టీ20ల్లో మాత్రమే కాకుండా వన్డేలు, టెస్టుల్లో కూడా విరాట్ కోహ్లీ, బాబర్‌ అజామ్​లు నా ఫేవరెట్‌ బ్యాటర్లు. వీరి తర్వాతి స్థానంలో శుభ్‌మన్‌ గిల్ ఉన్నాడు. అతడు ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే భవిష్యత్‌లో టీమ్‌ఇండియాకు ప్రధాన ఆటగాడిగా కచ్చితంగా మారతాడు."

- మహ్మద్​ అమీర్​, పాక్​ ప్లేయర్​

బౌలింగ్​లో వీరే ఫేవరెట్..
IND vs PAK World Cup 2023 : ఈ సందర్భంగా తన ఫేవరెట్​ బౌలర్లు ఎవరో కూడా తెలిపాడు. న్యూజిలాండ్ పేసర్‌ ట్రెంట్ బౌల్ట్‌, పాక్‌ ఫాస్ట్ బౌలర్‌ నసీమ్‌ షా, ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్​లు క్రికెట్​ మూడు ఫార్మాట్లలో తన ఫేవరెట్ బౌలర్లని చెప్పాడు.

ఇక భారత్‌ వేదికగా జరగనున్న ప్రతిష్ఠాత్మక ఐసీసీ వన్డే ప్రపంచకప్​కు సంబంధించి తాజాగా షెడ్యూల్‌ ఖరారైంది. అక్టోబర్‌ 5వ తేదీ నుంచి నవంబర్‌ 19 వరకు ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ క్రమంలో అక్టోబర్‌ 8న అస్ట్రేలియాతో భారత్‌.. తన తొలి మ్యాచ్‌ చెన్నైలో ఆడనుంది. ఆ తర్వాతి మ్యాచ్​ అహ్మదాబాద్‌ వేదికగా అక్టోబర్‌ 15న పాక్​తో తలపడనుంది.

కరేబియన్​ల​తో కాలుదువ్వేది వీరే..
Indian Team For Indies Tour : టీమ్‌ఇండియా త్వరలో విండీస్‌ పర్యటనకు వెళ్లనుంది. వెస్టిండీస్‌తో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. వన్డేలు, టెస్టులకు బీసీసీఐ ఇటీవల జట్లను ప్రకటించింది. కాగా, జులై 12 నుంచి టెస్టు సిరీస్‌ ప్రారంభంకానుంది. రోహిత్ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్ గిల్, రుతురాజ్‌ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానె (వైస్‌ కెప్టెన్‌), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్‌ కిషన్‌ (వికెట్ కీపర్‌), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్‌, అక్షర్‌ పటేల్, మహ్మద్‌ సిరాజ్‌, ముఖేశ్ కుమార్‌, జయ్‌దేవ్ ఉనద్కత్‌, నవ్‌దీప్‌ సైనీ.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.