అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(icc ranking odi) మంగళవారం మహిళల వన్డే ర్యాంకింగ్స్‌ను(women's odi ranking) విడుదల చేసింది. టీమ్ఇండియా సారథి మిథాలీ రాజ్(762 పాయింట్లు) మరోసారి అగ్రస్థానంలో నిలవగా.. ఓపెనర్ స్మృతి మంధాన(smriti mandhana odi ranking) ఓ పాయింట్‌ను మెరుగుపరచుకుని ఏడో ర్యాంకుకు చేరుకుంది.
ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో 79 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన న్యూజిలాండ్ వైస్‌కెప్టెన్ అమీ సట్టర్వైట్ ఐదో స్థానానికి ఎగబాకింది. ఇదే మ్యాచ్‌లో 89 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఇంగ్లీష్ జట్టు కెప్టెన్ హీథర్ నైట్(Heather Knight stats) ఏకంగా ఐదు పాయింట్లు ముందుకు జరిగి తొమ్మిదో ర్యాంకుకు చేరింది. మరో ఇంగ్లాండ్ ప్లేయర్ నటాలియా సీవర్(Natalie Sciver) కూడా తొమ్మిదో స్థానంలో నిలిచింది.

బౌలింగ్ విభాగంలో టీమ్ఇండియా పేసర్ జులన్ గోస్వామి(694 పాయింట్లు, jhulan goswami ranking) ఓ ర్యాంకు మెరుగుపరచుకుని నాలుగో స్థానానికి ఎగబాకగా.. తొమ్మిదో ర్యాంకులో పూనమ్ పాండే(617) నిలిచింది. ఇంగ్లాండ్ ప్లేయర్స్ సోఫీ ఎక్లిస్టోన్, కేథరిన్ బ్రంట్(Sophie Ecclestone, Katherine Brunt) ఆరు, ఏడు స్థానాల్లో కొనసాగుతున్నారు. తొలి రెండు స్థానాల్లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు జెస్ జొనాసన్, మేగాన్ షట్(jess jonassen, megan schutt) ఉన్నారు.

ఆల్‌రౌండర్ విభాగంలో దీప్తి శర్మ(భారత్, 331 పాయింట్లు) నాలుగో ర్యాంకులో నిలవగా.. తొలి మూడు స్థానాల్లో ఎలిస్ పెర్రీ(ఆస్ట్రేలియా, 418) మరిజన్నే కప్( దక్షిణాఫ్రికా, 384), నటాలియా సీవర్(ఇంగ్లాండ్, 380) ఉన్నారు.

ఇదీచూడండి: Mithali Raj News: తొలి మహిళా క్రికెటర్‌గా మిథాలీ రాజ్ రికార్డు