ETV Bharat / sports

'క్వారంటైన్, బయో బబుల్ చాలా కష్టం బాబోయ్' - డేనైట్ డెస్టుపై మిథాలీ రాజ్

టీమ్ఇండియా మహిళా జట్టు త్వరలోనే ఇంగ్లాండ్ పయనమవనుంది. అక్కడ ఒక టెస్టు, మూడు వన్డేలు, టీ20లు ఆడనుంది. ఆ తర్వాత ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాతో డేనైట్ టెస్టు మ్యాచ్​లో తలపడనుంది. తాజాగా ఈ విషయాలపై స్పందించింది కెప్టెన్ మిథాలీరాజ్. కరోనా పరిస్థితులు, ఇంగ్లాండ్‌ పర్యటన, ఆస్ట్రేలియాతో గులాబి బంతి పోరు లాంటి విషయాలపై 'ఈనాడు'తో మాట్లాడింది.

Mithali Raj
మిథాలీరాజ్
author img

By

Published : May 22, 2021, 8:03 AM IST

టీమ్‌ఇండియా మహిళల క్రికెట్‌ చరిత్రలో గులాబి బంతి పోరు సరికొత్త అధ్యాయమని కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ అభివర్ణించింది. టీమ్‌ఇండియాకు ఒకే ఏడాది రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడే అవకాశం రావడం శుభపరిణామమని తెలిపింది. ఇంగ్లాండ్‌లో ఒక టెస్టు, మూడేసి వన్డేలు.. టీ20లు ఆడనున్న టీమ్‌ఇండియా మహిళల జట్టు ప్రస్తుతం ముంబయిలో బయో బబుల్‌లో ఉంది. కోహ్లీసేనతో పాటే జూన్‌ 2న ఇంగ్లాండ్‌లో అడుగుపెట్టనుంది. భారత టెస్టు, వన్డే జట్లకు సారథ్యం వహిస్తున్న మిథాలీ.. కరోనా పరిస్థితులు, ఇంగ్లాండ్‌ పర్యటన, ఆస్ట్రేలియాతో గులాబి బంతి పోరు లాంటి విషయాలపై 'ఈనాడు'తో మాట్లాడింది. ఆ విశేషాలు..

ఓవైపు కరోనా, మరోవైపు ఇంగ్లాండ్‌ పర్యటన.. సన్నద్ధత ఎలా?

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ప్రయాణాలు కాస్త ఇబ్బందే. వైరస్‌ సోకే ప్రమాదం ఉంటుంది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఏం జరుగుతుందో చెప్పలేం. ఇక క్వారంటైన్‌ అతి పెద్ద సవాల్‌. ఈనెల 19 నుంచి జూన్‌ 2 వరకు ముంబయిలో క్వారంటైన్‌లో ఉంటాం. ఇంగ్లాండ్‌కు వెళ్లాక మరో 10 రోజులు ఇలాగే గడపాలి. 20 నుంచి 25 రోజులు క్వారంటైన్‌లో ఉండటం మానసికంగా చాలా కష్టం. హోటల్‌లో అన్నీ మూసేసి ఉంటాయి. ఇంట్లో మాదిరిగా తలుపులు, కిటికీలు తీయలేం. ఎక్కువ స్థలం కూడా ఉండదు. రోజుల తరబడి హోటల్‌ గదిలో ఉండటం ఎవరికైనా కష్టమే.

Mithali Raj
మిథాలీరాజ్

బయో బబుల్‌ క్రికెటర్లపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

మ్యాచ్‌ ముగిశాక సాయంత్రాలు బయటకు వెళ్లడం క్రికెటర్లకు అలవాటు. బాగా ప్రదర్శన చేసినవాళ్లు మరింత ఉత్సాహంగా ఉండేందుకు.. విఫలమైన వాళ్లు ఒత్తిడికి దూరంగా ఉండేందుకు ఇలా చేస్తారు. మరుసటి రోజు ఆట లేదా తర్వాతి మ్యాచ్‌కు మానసికంగా సిద్ధమయ్యేందుకు ఇది దోహద పడుతుంది. బయో బబుల్‌ వాతావరణం నేపథ్యంలో హోటల్‌లో, మైదానంలో చూసిన వాళ్లనే మళ్లీ మళ్లీ చూడాల్సి ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత విసుగొస్తుంది. ప్రతి ఒక్కరికి ఈ పరిస్థితి కొత్త కాబట్టి తప్పదు. కొన్ని రోజుల తర్వాత అలవాటు అవుతుంది. అలవాటు పడక తప్పదు కూడా. మనుగడకు ప్రమాదమన్నప్పుడు ప్రతి ఒక్కరు సర్దుకుపోతారు. ఇప్పుడు అదే జరుగుతోంది.

ఏడేళ్ల తర్వాత మళ్లీ టెస్టు ఆడనుండటం ఎలా అనిపిస్తోంది?

ఇప్పుడున్న జట్టులో నేను, జులన్‌, శిఖ, పూనమ్‌ రౌత్‌, స్మృతి, హర్మన్‌, ఏక్తా ఏడేళ్ల క్రితం టెస్టు ఆడాం. మిగతా వాళ్లంతా కొత్తవాళ్లే. వారిపై ఎలాంటి ఒత్తిడి ఉండదు. స్వేచ్ఛగా ఆడతారు. సుదీర్ఘ కాలం తర్వాత టెస్టు మ్యాచ్‌ ఆడుతుండటం సీనియర్లకే సవాల్‌. నాలుగైదేళ్లలో రెండ్రోజుల మ్యాచ్‌ కూడా ఆడలేదు. మళ్లీ టెస్టు క్రికెట్‌ లయను దొరకబుచ్చుకోవడం మాకు సవాలే. ఏడాదిలో కనీసం ఒకటి లేదా రెండు టెస్టు మ్యాచ్‌లు ఉంటే బాగుంటుంది. ద్వైపాక్షిక సిరీస్‌ల్లో ఒక టెస్టును జోడిస్తే మేలు.

టీ20లతో మహిళల క్రికెట్‌కు ఆదరణ పెరుగుతున్న సమయంలో టెస్టుల పట్ల అభిమానులకు ఆసక్తి ఉంటుందా?

మహిళల క్రికెట్లో టెస్టుల నిర్వహణను రెండు విధాలుగా చూడాలి. క్రికెటర్ల పరంగా ఇది సానుకూలాంశం. ప్రతి ఒక్క క్రికెటర్‌ సుదీర్ఘ ఫార్మాట్‌ ఆడాలని అనుకుంటారు. క్రికెట్లో అత్యంత సవాల్‌తో కూడిన ఫార్మాట్‌ టెస్టులే. అన్ని అంశాల్లో సవాళ్లు ఎదురవుతాయి. నైపుణ్యం, అంకితభావం, శారీరక ఫిట్‌నెస్‌, మానసిక దృఢత్వానికి పరీక్ష ఎదురవుతుంది. టెస్టులు ఆడటం వల్ల క్రికెటర్లకు అన్ని విధాలుగా లాభమే. అయితే ఆదరణ పరంగా వన్డేలు, టీ20లు ఆకర్షణీయంగా ఉంటాయి. టీ20లతో ఎక్కువ వినోదం లభిస్తుంది. వన్డేలు, టీ20లతోనే వాణిజ్య పరంగా గిట్టుబాటు అవుతుంది. కానీ క్రికెట్‌ మూలాలు టెస్టులతోనే ముడిపడి ఉంటాయన్న సంగతి మరిచిపోకూడదు.

team india
టీమ్ఇండియా

ఇంగ్లాండ్‌ పర్యటనలో భారత్‌కు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి?

మూడేళ్ల తర్వాత ఇంగ్లాండ్‌లో ఆడబోతున్నాం. క్వారంటైన్‌ ఆలోచనల నుంచి బయపడటం.. పరిస్థితులను తొందరగా అలవాటు చేసుకోవడం కీలకం. సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో కాస్త విఫలమయ్యాం. అయితే ఆ సిరీస్‌ అనంతరం దాదాపుగా లాక్‌డౌన్‌లోనే ఉన్నాం. సాధన, మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లేదు. కొన్ని రోజులుగా ఉదయం కొద్దిసేపు మాత్రమే వెసులుబాటు లభిస్తోంది. తక్కువ సమయంలోనే ఎంతోకొంత సాధన చేయగలిగాం. ఇంకాస్త సన్నద్ధత అవసరం. ఇంగ్లాండ్‌ పరిస్థితులు స్థానిక జట్టుకు అనుకూలంగా ఉంటాయి. పైగా అనుభజ్ఞులతో ఇంగ్లాండ్‌ జట్టు పటిష్టంగా ఉంది. కానీ టీమ్‌ఇండియాలో నాణ్యమైన క్రికెటర్లున్నారు. పరిస్థితులకు త్వరగా అలవాటు పడితే టెస్టు, వన్డే, టీ20 సిరీస్‌లలో సానుకూల ఫలితాలు రాబట్టొచ్చు.

15 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాలో టీమ్‌ఇండియా టెస్టు మ్యాచ్‌ ఆడనుండటంపై మీ అభిప్రాయం?

2006లో చివరిసారిగా ఆస్ట్రేలియాలో టెస్టు మ్యాచ్‌ ఆడాం. అప్పుడు ఆడిన వాళ్లలో నేను, జులన్‌ మాత్రమే ఇప్పటి జట్టులో ఉన్నాం. ఆస్ట్రేలియాతో గులాబి బంతితో టెస్టు మ్యాచ్‌ ఆడబోతున్నాం. మహిళల క్రికెట్‌ చరిత్రలో ఇది సరికొత్త అధ్యాయం. భారత అమ్మాయిలకు గొప్ప అవకాశం. మహిళల జట్టుకు ఎక్కువ టెస్టులు ఆడే అవకాశం లభిస్తుండటం సానుకూల పరిణామం. అయితే గులాబి బంతితో డేనైట్‌ పోరు సవాల్‌తో కూడుకున్నది. టీమ్‌ఇండియాలో నాతో సహా ఎవరికీ గులాబి బంతితో ఆడిన అనుభవం లేదు. ఆ పోరుకు ముందు దేశవాళీలో గులాబి బంతితో కొన్ని ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు నిర్వహిస్తే బాగుంటుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.