ETV Bharat / sports

అగ్రస్థానం కోల్పోయిన మిథాలీ.. గోస్వామి, మంధాన పైపైకి - జులాన్ గోస్వామి రెండో ర్యాంకుకు

ఐసీసీ (ICC odi ranking) తాజాగా విడుదల చేసిన మహిళల వన్డే ర్యాంకింగ్స్(icc women's odi ranking)​లో అగ్రస్థానాన్ని కోల్పోయింది టీమ్ఇండియా కెప్టెన్ మిథాలీ రాజ్. భారత పేసర్ జులాన్ గోస్వామి రెండో ర్యాంకుకు చేరుకోగా.. స్మృతి మంధాన తన ర్యాంకును మెరుగుపర్చుకుంది.

ICC
ఐసీసీ
author img

By

Published : Sep 28, 2021, 3:39 PM IST

​ఐసీసీ తాజాగా విడుదల చేసిన మహిళల వన్డే ర్యాకింగ్స్(icc women's odi ranking)​లో టీమ్ఇండియా మహిళా సారథి మిథాలీ రాజ్(mithali raj ranking icc) తన అగ్రస్థానాన్ని కోల్పోయింది. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్​లో పేలవ ప్రదర్శన చేయడమే ఇందుకు కారణం. ఈ సిరీస్​లో మిథాలీ 29 సగటుతో కేవలం 87 పరుగులు మాత్రమే చేసింది. ప్రస్తుతం 738 పాయింట్లతో మూడో స్థానానికి పడిపోయిందీ సీనియర్ బ్యాటర్. దక్షిణాఫ్రికాకు చెందిన లిజెల్లే లీ (761) అగ్రస్థానానికి చేరుకోగా, ఆసీస్​ బ్యాటర్ అలిసా హేలీ (750) రెండో ర్యాంకుకు చేరుకుంది. టీమ్ఇండియా స్టైలిష్ బ్యాటర్ స్మృతి మంధాన(smriti mandhana ranking) ఒక ర్యాంకు మెరుగు పర్చుకుని 710 పాయింట్లతో ఆరో స్థానానికి చేరుకుంది.

బౌలింగ్ విభాగానికి వస్తే భారత సీనియర్ బౌలర్ జులాన్ గోస్వామి(jhulan goswami ranking) రెండో ర్యాంకుకు ఎగబాకింది. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్​లో మూడు వన్డేల్లో 4 వికెట్లు సాధించి ర్యాంక్​ను మెరుగుపర్చుకుంది. ఫైనల్​లో మ్యాచ్​లో మూడు వికెట్లతో అలరించింది. ఫలితంగా ఆల్​రౌండర్ల విభాగంలోనూ మూడు స్థానాలు ఎగబాకి 10వ స్థానానికి చేరుకుంది గోస్వామి. బౌలర్ల విభాగంలో జులాన్ కంటే ముందు 760 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది ఆస్ట్రేలియా బౌలర్ జెస్ జొనాస్సెన్. మరో ఆసీస్ బౌలర్ మెగాన్ స్కట్​ మూడో స్థానంలో నిలిచింది.

ఆల్​రౌండర్ల విభాగంలో ఆస్ట్రేలియాకు చెందిన ఎలిస్ పెర్రీ తన అగ్రస్థానాన్ని కోల్పోయి మూడో స్థానానికి పడిపోయింది. దక్షిణాఫ్రికాకు చెందిన మరిజానే కప్​ టాప్​లో ఉండగా నటాలియా సీవర్ రెండో ర్యాంకుకు చేరుకుంది. టీమ్ఇండియా ఆల్​రౌండర్ దీప్తి శర్మ ఒక ర్యాంకు పడిపోయి ఐదో స్థానానికి చేరుకుంది.

ఇవీ చూడండి: ముంబయి ఒక్క మ్యాచ్​ ఓడినా ఆశలు గల్లంతే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.