పాకిస్థాన్ పురుషుల క్రికెట్ జట్టు ప్రధానకోచ్ మిస్బా-ఉల్-హక్.. ఆ పదవికి రాజీనామా చేశాడు. ఇతడితో పాటు బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్ కూడా తప్పుకొన్నాడు. వీరిద్దరూ.. తమ నిర్ణయాలను సోమవారం ఉదయం పాక్ క్రికెట్ బోర్డుకు తెలిపారు.
"మిస్బా, వకార్ యూనిస్‌లు 2019 సెప్టెంబరులో కోచ్‌లుగా పదవులు స్వీకరించగా.. ఇప్పుడు వారిద్దరూ తమ పదవుల నుంచి తప్పుకొంటున్నట్లు వెల్లడించారు" అని పీసీబీ అధికారి తెలిపారు.
పాకిస్థాన్‌తో జరగనున్న పరిమిత ఓవర్ల సిరీస్‌లో పాల్గొనేందుకు న్యూజిలాండ్ జట్టు సెప్టెంబరు 11న ఇస్లామాబాద్ చేరుకోనుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబరు 8న పాక్ జట్టు సమావేశం కానుంది. ఈ సిరీస్ కోసం సక్లైస్ ముస్తాక్, అబ్దుల్ రజాక్‌లను తాత్కాలిక కోచ్‌లుగా నియమిస్తూ పీసీబీ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రధానకోచ్, బౌలింగ్ కోచ్ తమ పదవుల నుంచి తప్పుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదీ చూడండి.. మెగాటోర్నీ కోసం జట్టును ప్రకటించిన పాకిస్థాన్