ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో విఫలమైన తర్వాత తన ఆలోచనా దృక్పథంలో మార్పులు చేసుకోవడం వల్లే ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరగుతున్న తొలి టెస్టులో బాగా రాణించినట్లు తెలిపాడు టీమ్ఇండియా పేసర్ బుమ్రా. ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 9 వికెట్లు తీసిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేశాడు.
" పెద్దగా మార్పులేమీ చేసుకోలేదు. ఆలోచనా విధానాన్ని మార్చుకున్నా. ఫలితాల కోసం ఆశించకుండా వర్తమానంలో ఉంటున్నా. కొత్త మెలకువలను నేర్చుకుంటూ నా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తున్నా. ఆటను ఆస్వాదిస్తున్నా. గెలవాలనే ఆత్మివిశ్వాసంతో గేమ్ ఆడాలి."
-బుమ్రా, టీమ్ఇండియా పేసర్.
ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 183 పరుగులు చేయగా.. టీమ్ఇండియా 278 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థి జట్టు 303 స్కోరు సాధించగా.. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు 157 రన్స్ వెనుకంజలో ఉంది.
ఇదీ చూడండి: రాహుల్ ఆటలో ఇంత మార్పు ఎలా?