ETV Bharat / sports

'ప్రపంచకప్ గెలుచుంటే నేను రిటైర్మెంట్ పక్కా'

author img

By

Published : Jun 16, 2021, 5:41 PM IST

2019 వన్డే వరల్డ్​కప్(2019 World cup)​ ఫైనల్​లో విజయం సాధిస్తే అంతర్జాతీయ క్రికెట్​ నుంచి తప్పుకునేవాడినని న్యూజిలాండ్​ ఆటగాడు రాస్ టేలర్​ అన్నాడు. వరల్డ్ టెస్ట్​ ఛాంపియన్​షిప్​ ఫైనల్​ మ్యాచ్​ శుక్రవారం నుంచి జరగనున్న నేపథ్యంలో టేలర్​ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ross taylor
రిటైర్మెంట్​పై రాస్ టేలర్

2019 వన్డే వరల్డ్ కప్​ ఫైనల్​లో విజయం సాధిస్తే.. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ అయ్యేవాడినని న్యూజిలాండ్ బ్యాట్స్​మెన్​ రాస్​ టేలర్ అన్నారు​. సౌతాంప్టన్​ వేదికగా శుక్రవారం జరగనున్న వరల్డ్ టెస్ట్​ ఛాంపియన్​షిప్​ ఫైనల్​ మ్యాచ్​లో భారత్​తో న్యూజిలాండ్​ తలపడనుంది. ఈ నేపథ్యంలోనే టేలర్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

"2019 లో జరిగిన వరల్డ్​కప్ ఫైనల్ మ్యాచ్​ ఓడిపోవడం వల్ల నిరుత్సాహానికి గురయ్యాను. నాకదే చివరి ప్రపంచకప్​ అని అందరూ అనుకుని ఉంటారు. కానీ ఇంకా అంతర్జాతీయ క్రికెట్​లో ఉండటం ఆనందాన్నిచ్చింది. ఒకవేళ ఆ టోర్నీలో గెలిచి ఉంటే నేను రిటైర్ అయ్యేవాడిని"

-రాస్​ టైలర్

టేలర్.. అన్ని ఫార్మాట్లలో కలిపి ఇప్పటివరకు 442 అంతర్జాతీయ మ్యాచ్​లు ఆడాడు​. 37 ఏళ్ల ఈ బ్యాట్స్​మెన్ న్యూజిలాండ్ జట్టులో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్​లో మొత్తంగా 18,000 పరుగులు​ చేశాడు.

ఇవీ చదవండి:

IPL​ ఎఫెక్ట్: ఆసీస్ స్టార్ క్రికెటర్లు ఆ సిరీస్​లకు దూరం

WTC Final: 'అలా అయితే టీమ్ఇండియానే విజేత'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.