ETV Bharat / sports

'బాల్ టాంపరింగ్ గురించి తెలిసినా నోరు మెదపరు' - క్రికెట్‌ ఆస్ట్రేలియా

బాల్ టాంపరింగ్ వివాదంపై క్రికెట్ ఆస్ట్రేలియా దర్యాప్తు సమగ్రంగా లేదన్నాడు ఇంగ్లాండ్‌ మాజీ సారథి మైఖేల్‌ వాన్‌. అలా చేయడం వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదన్న వాన్.. ఈ వ్యవహారం గురించి జట్టులోని ముగ్గురికి మాత్రమే తెలుసంటే నమ్మశక్యంగా లేదని చెప్పాడు.

michael vaughan feels doing piecemeal investigation will effect backside commenting on ball tampering
'బాల్ టాంపరింగ్ గురించి తెలిసినా నోరు మెదపరు'
author img

By

Published : May 21, 2021, 10:34 AM IST

బాల్‌ టాంపరింగ్‌ వివాదంలో క్రికెట్‌ ఆస్ట్రేలియా చేపట్టిన దర్యాప్తు ముక్కలు ముక్కలుగా ఉందని, ఆ వివాదానికి సంబంధించి అనేక సమాధానాలు లేని ప్రశ్నలు మిగిలాయని ఇంగ్లాండ్‌ మాజీ సారథి మైఖేల్‌ వాన్‌ అభిప్రాయపడ్డాడు. 2018లో దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు సందర్భంగా ఆసీస్‌ ఆటగాడు కామెరూన్‌ బాన్‌క్రాఫ్ట్‌ బాల్‌ టాంపరింగ్‌కు పాల్పడ్డాడు. జేబులో ఉప్పుకాగితం ఉంచుకొని బంతికి రాయడం పెద్దతెర మీద స్పష్టంగా కనిపించడం వల్ల కంగారూల జట్టు తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఈ క్రమంలోనే అందుకు కారకులైన కెప్టెన్‌ స్టీవ్‌స్మిత్‌, వైస్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌తో పాటు బాన్‌క్రాఫ్ట్‌ను సైతం ఆ జట్టు బోర్డు ఏడాది పాటు నిషేధం విధించింది.

మరోసారి తెరపైకి..

కాగా, ఆ వివాదం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న ఆస్ట్రేలియాకు మరో తలనొప్పి వచ్చి పడింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బాన్‌క్రాఫ్ట్‌ మాట్లాడుతూ నాటి టాంపరింగ్‌ గురించి జట్టులోని బౌలర్లకు కూడా ముందే తెలుసన్నాడు. దాంతో ఆ వివాదం మరోసారి తెరపైకి రాగా, క్రికెట్ ఆస్ట్రేలియా మళ్లీ విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే స్పందించిన వాన్‌.. సిడ్నీ హెరాల్డ్‌కు రాసిన వ్యాసంలో ఇలా చెప్పుకొచ్చాడు.

"దీనిపై నేను మాట్లాడిన చాలా మంది మాజీ ఆటగాళ్లు.. ఆ ఉదంతం గురించి కేవలం ముగ్గురికే తెలుసంటే నమ్మశక్యకం కాదన్నారు. డ్రెస్సింగ్‌ రూమ్‌లో కొందరికి తెలిసి, వ్యతిరేకించి కూడా ఉండొచ్చు. కానీ, ఈ విషయాన్ని వాళ్లు బయటకు చెప్పరు. ఎందుకంటే తమ కెప్టెన్‌కు వ్యతిరేకంగా మాట్లాడరు. చివరగా నేను చెప్పేది.. క్రికెట్‌ ఆస్ట్రేలియా ఇలా ముక్కలు ముక్కలుగా విచారించి అనేక ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోతే.. అది వాళ్లకే నష్టం కలిగిస్తుంది. దాని వల్ల ఎవరికీ ఉపయోగం లేదు."

-మైఖేల్‌ వాన్‌, ఇంగ్లాండ్‌ మాజీ సారథి

ఇక ఇదే విషయంపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ మైఖేల్‌ క్లార్క్‌ ఇదివరకు స్పందిస్తూ.. టాంపరింగ్‌ జరిగినప్పుడు దాని గురించి ఇతరులకు ముందే తెలిసినా అందులో ఆశ్చర్యపోడానికి ఏమీ లేదన్నాడు. మరోవైపు అప్పటి మ్యాచ్‌లో బౌలర్లుగా ఆడిన పాట్‌ కమిన్స్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌, మిచెల్‌ స్టార్క్‌, స్పిన్నర్ నాథన్‌ లైయన్‌ ఇటీవల ఈ వివాదంపై స్పందించారు. అప్పుడు టాంపరింగ్‌ గురించి తమకేమీ తెలియదని, ఆ వివాదం జరిగి చాలా కాలమైందని, దాని గురించి మర్చిపోయి ముందుకు వెళ్లాలని కోరారు. ఈ వివాదానికి ముగింపు పలకాలని క్రికెట్‌ ఆస్ట్రేలియాకు విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి: బాల్ ట్యాంపరింగ్ రగడపై బాన్​క్రాఫ్ట్ వెనకడుగు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.