Major League Cricket 2023 : ఐపీఎల్‌లోనే కాదు.. అమెరికా నిర్వహించే మేజర్ లీగ్ క్రికెట్ -2023 టోర్నీలో కూడా ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ అప్రతిహతంగా దూసుకెళ్తోంది. తాజాగా జరిగిన ఎమ్ న్యూయార్క్ జట్టు మేజర్ లీగ్ క్రికెట్- 2023 తొలి ఎడిషన్‌లో విజేతగా నిలిచింది. డల్లాస్ వేదికగా సీటెల్ ఓర్కాస్ జట్టుతో జరిగిన తుది పోరులో ఎమ్ఐ బ్యాటర్ నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 249.09 స్ట్రైక్‌రేటుతో 10 ఫోర్లు, 13 సిక్సర్లతో పరుగుల వరద పారించాడు. 55 బంతుల్లో 137 పరుగులు చేసి శకక్కొట్టాడు. దీంతో ఫైనల్ పోరులో సీటెల్ ఓర్కాస్‌పై 7 వికెట్ల తేడాతో ఎమ్ఐ విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచింది.
-
An innings of a lifetime. A win for eternity. 💙💙💙#MINewYork - Champions of #MajorLeagueCricket 🏆😎#OneFamily #SORvMINY | @nicholas_47 pic.twitter.com/FWaDkAqmrW
— MI New York (@MINYCricket) July 31, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">An innings of a lifetime. A win for eternity. 💙💙💙#MINewYork - Champions of #MajorLeagueCricket 🏆😎#OneFamily #SORvMINY | @nicholas_47 pic.twitter.com/FWaDkAqmrW
— MI New York (@MINYCricket) July 31, 2023An innings of a lifetime. A win for eternity. 💙💙💙#MINewYork - Champions of #MajorLeagueCricket 🏆😎#OneFamily #SORvMINY | @nicholas_47 pic.twitter.com/FWaDkAqmrW
— MI New York (@MINYCricket) July 31, 2023
MI New York Final : 184 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన ఎమ్ఐ మొదటి ఓవర్లోనే మొదటి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ స్టీవెన్ టేలర్ డకౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ శయన్ జహంగీర్ 10 పరుగులకే పెవిలియన్ చేరాడు. దీంతో ఎమ్ఐ న్యూయార్క్ జట్టు పీకల్లోతి కష్టాల్లో కూరుకుపోయింది. అప్పుడొచ్చిన నికోలస్ పూరన్.. మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. దీంతో 16 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఎమ్ఐ లక్ష్యాన్ని ఛేదించింది. సీటెల్ ఓర్కాస్ బౌలర్లలో ఇమాద్ వాసిం, పార్నెల్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
-
𝐂.𝐇.𝐀.𝐌.𝐏.𝐈.𝐎.𝐍.𝐒. 🇺🇸💙#OneFamily #MINewYork #MajorLeagueCricket pic.twitter.com/kiXa5bZBkA
— MI New York (@MINYCricket) July 31, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">𝐂.𝐇.𝐀.𝐌.𝐏.𝐈.𝐎.𝐍.𝐒. 🇺🇸💙#OneFamily #MINewYork #MajorLeagueCricket pic.twitter.com/kiXa5bZBkA
— MI New York (@MINYCricket) July 31, 2023𝐂.𝐇.𝐀.𝐌.𝐏.𝐈.𝐎.𝐍.𝐒. 🇺🇸💙#OneFamily #MINewYork #MajorLeagueCricket pic.twitter.com/kiXa5bZBkA
— MI New York (@MINYCricket) July 31, 2023
MI New York Vs Seattle Orcas : అంతకుముందు టాస్ గెలిచిన ఓడి బ్యాటింగ్‌కు దిగిన సీటెల్ ఓర్కాస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేశారు. ఓపెనర్ డికాక్ (87) అద్భుత ప్రదర్శన చేశాడు. సుభ్మన్ రంజనే (29), ప్రిటోరిస్ (21), ఎస్ జయసూర్య (16) పరుగులు చేసి ఫర్వాలేదనిపించారు. ఇక మిగతా వారంతా సింగిల్ డిజిట్ స్కోరుకో పెవిలియన్ చేరారు. ఇక ఎమ్ఐ బౌలర్లలో బౌల్ట్, రషీద్ ఖాన్ చెరో మూడు వికెట్ల చొప్పున పడగొట్టారు. స్టీవెన్ టైలర్, వీస్ ఒక్కో వికెట్ తీశారు.
-
The fireworks had nothing on Nicky P tonight, NOTHING! 🎇The moment we became the first #MajorLeagueCricket champions. 🏆💙 #OneFamily #MINewYork pic.twitter.com/8bXE7Aq3V4
— MI New York (@MINYCricket) July 31, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">The fireworks had nothing on Nicky P tonight, NOTHING! 🎇The moment we became the first #MajorLeagueCricket champions. 🏆💙 #OneFamily #MINewYork pic.twitter.com/8bXE7Aq3V4
— MI New York (@MINYCricket) July 31, 2023The fireworks had nothing on Nicky P tonight, NOTHING! 🎇The moment we became the first #MajorLeagueCricket champions. 🏆💙 #OneFamily #MINewYork pic.twitter.com/8bXE7Aq3V4
— MI New York (@MINYCricket) July 31, 2023
పనికిరాని పూరన్ రికార్డులు!
Nicholas Pooran Major League Cricket : నికోలస్ పూరన్ అద్భుత ప్రదర్శనను ఓ మరుపురాని ఇన్నింగ్స్‌గా గుర్తుంచుకోవమే. దాని వల్ల అతడికి ఏ ఉపయోగం లేదు. ఈ ఇన్నింగ్స్‌కు రికార్డుల్లో ఎలాంటి స్థానం ఉండదు. ఎందుకంటే ఈ లీగ్‌ను అమెరికా నిర్వహిస్తోంది. అయితే, యూఎస్ ప్రస్తుతం అసోసియేట్ మెంబర్‌గానే ఉంది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం.. మేజర్ క్రికెట్ లీగ్- ఎమ్‌ఎల్‌సీకి అధికారిక టీ20ల్లో అధికారిక హోదా లేదు.
Major League Cricket Teams : ఈ లీగ్ జులై 13న మొదలైంది. ఈ ఎమ్‌ఎల్‌సీలో లాస్ ఏంజెలెస్ నైట్‌రైడర్స్, ఎమ్ఐ న్యూయార్క్, శాన్‌ఫ్రాన్సిస్కో, సీటెల్ ఓర్కాస్, టెక్సాస్ సూపర్ కింగ్స్, వాషింగ్టన్ ఫ్రీడమ్ పేరిట ఆరు టీమ్‌లు పోటీపడ్డాయి.