ETV Bharat / sports

'అఫ్గాన్ మహిళల్ని ఆడనిస్తేనే పురుషుల జట్టుతో ఆడతాం' - క్రికెట్ ఆస్ట్రేలియా న్యూస్

అఫ్గానిస్థాన్ మహిళలను క్రికెట్​ ఆడేందుకు ప్రోత్సహిస్తేనే.. పురుషుల జట్టుతో ఆస్ట్రేలియా టెస్టు మ్యాచ్​ జరుగుతుందని క్రికెట్ ఆస్ట్రేలియా(Cricket Australia News) పేర్కొంది. నవంబర్ 27న ఆస్ట్రేలియా, అఫ్గాన్​ జట్ల మధ్య టెస్టు మ్యాచ్ జరగాల్సి ఉంది.

cricket australia
క్రికెట్ ఆస్ట్రేలియా
author img

By

Published : Sep 9, 2021, 11:01 AM IST

Updated : Sep 9, 2021, 11:49 AM IST

ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్​ జట్ల(Australia vs Afghanistan Test 2021) మధ్య నవంబర్​లో ఓ టెస్టు మ్యాచ్​ జరగాల్సి ఉంది. అయితే.. ఈ మ్యాచ్​ నిర్వహణపై ప్రస్తుతం సందిగ్ధత నెలకొంది. అఫ్గాన్​ను వశం చేసుకున్న తాలిబన్లు మహిళా క్రికెట్​ను ప్రోత్సహించకపోతే.. పురుషుల జట్టుతోనూ తాము టెస్టు ఆడబోమని క్రికెట్​ ఆస్ట్రేలియా(Cricket Australia Afghanistan) ప్రకటించింది.

"ప్రపంచవ్యాప్తంగా మహిళా క్రికెట్​కు ఆదరణ పెరగడం అవసరం. క్రికెట్​ అనేది అందరి క్రీడ. మహిళలనూ సమానంగా చూడాలి, వారికీ ఆడే అవకాశం కల్పించాలి" అని క్రికెట్​ ఆస్ట్రేలియా తమ అధికారిక ప్రకటనలో తెలిపింది.

తాలిబన్లు.. మహిళలు క్రికెట్​ ఆడకూడదనే నియమం పెట్టిన మాట నిజమే అయితే.. పురుషుల జట్టుతో టెస్టు మ్యాచ్​ రద్దు చేయడం అనివార్యమని క్రికెట్ ఆస్ట్రేలియా(Cricket Australia News) తేల్చిచెప్పింది.

ఇదీ చదవండి:'భారత జట్టులో ప్రపంచ స్థాయి ఆటగాళ్లున్నారు'

Last Updated : Sep 9, 2021, 11:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.