Maxwell Kapil Dev World Record : 2023 ప్రపంచకప్‌లో నవంబర్ 7న అస్ట్రేలియా బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్.. అఫ్గానిస్థాన్‌పై ఆడిన ఇన్నింగ్స్ చరిత్రలో నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు.. మ్యాక్స్‌వెల్, ప్రత్యర్థి చేతుల్లోంచి .. మ్యాచ్ లాగేసుకున్న తీరు అద్భుతం. ఇలాంటి ఇన్నింగ్స్ మెగాటోర్నీలో చాలా అరుదు. అయితే సరిగ్గా నలభైఏళ్ల కింద ఇలాంటి ఇన్నింగ్స్ ఒకటి నమోదైందని మీకు తెలుసా?
అది 1983 వరల్డ్‌కప్ టోర్నమెంట్. ఆ టోర్నీలో భారత్ జూన్ 18న జింబాబ్వేతో డూ ఆర్ డై మ్యాచ్ ఆడుతోంది. ఆ మ్యాచ్‌లో భారత్ ఓడితే టోర్నీ నుంచి టీమ్ఇండియా నిష్ర్కమిస్తుంది. అలాంటి మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఆదిలోనె ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు సునీల్ గావస్కర్ (0), శ్రీకాంత్ (0) డకౌటయ్యారు. జింబాబ్వే పేస్ ధాటికి భారత్.. 17 పరుగులకే సగం (5) వికెట్లు కోల్పోయింది. ఇక భారత్ ఓటమి దాదాపు ఖాయమని అనుకున్నారంతా. కానీ, క్రీజులో ఉన్న అప్పటి టీమ్ఇండియా కెప్టెన్ కపిల్ దేవ్.. ఆశలు వదులుకోలేదు. కపిల్, జింబాబ్వే బౌలర్లకు ఎదురొడ్డి.. పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడాడు.
కపిల్ ఓ సైనికుడిలా పోరాడి ఒక్కడే 175 (138 బంతుల్లో : 16x4, 6x6) పరుగులు సాధించాడు. ఫలితంగా 17-5 స్థితిలో ఉన్న భారత్.. 266-8 వద్ద ఇన్నింగ్స్‌ను ముగించింది. అనంతరం జింబాబ్వేను 235 పరుగులకు ఆలౌట్ చేసి.. భారత్ 31 పరుగులతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో కపిల్ దేవ్, ఇన్నింగ్స్ గురించి అప్పటి క్రికెట్ ప్రేమికులు ఎంతో గొప్పగా చెప్పుకుంటారు. ఆరోజు కపిల్ పోరాటం అద్వితీయం అని ఇప్పటికీ ఆయడ్ని కొనియాడుతారు.
-
1983 :: Kapil Dev Scoring 175 Against Zimbabwe In World Cup pic.twitter.com/7cGgDCoCO8
— indianhistorypics (@IndiaHistorypic) November 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">1983 :: Kapil Dev Scoring 175 Against Zimbabwe In World Cup pic.twitter.com/7cGgDCoCO8
— indianhistorypics (@IndiaHistorypic) November 7, 20231983 :: Kapil Dev Scoring 175 Against Zimbabwe In World Cup pic.twitter.com/7cGgDCoCO8
— indianhistorypics (@IndiaHistorypic) November 7, 2023
అయితే అప్పటి కపిల్ పోరాడిన తీరుకు.. మంగళవారం నాటి మ్యాక్స్‌వెల్ ఇన్నింగ్స్‌కు ఎన్నో పోలికలు కనిపిస్తున్నాయి. ఈ టోర్నీలో సెమీస్ చేరాలంటే ఇరుజట్లకు మంగళవారం నాటి మ్యాచ్, చాలా ఇంపార్టెంట్. అలాంటి పోరులో ఆసీస్.. 292 పరుగుల లక్ష్య ఛేదనలో 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో నిలిచింది. ఆసీస్ నెగ్గాలంటే.. 31 ఓవర్లలో 200 పరుగులు కావాలి. చేతిలో ఉన్నవి 3 వికెట్లే. దీంతో ఇప్పటికే ఈ టోర్నీలో ఎన్నో అద్భుతాలు సృష్టించి పసికూన అఫ్గానిస్థాన్.. ఆసీస్‌పై కూడా భారీ విజయాన్ని నమోదు చేస్తుందని భావించారు.
-
Kapil Dev - India 17/5 & then he scored 175*(138) in 1983 World Cup.
— Johns. (@CricCrazyJohns) November 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Glenn Maxwell - Australia 91/7 & then he scored 201*(128) in 2023 World Cup.
- Two ultimate knocks ever. 🐐 pic.twitter.com/thJUiC115B
">Kapil Dev - India 17/5 & then he scored 175*(138) in 1983 World Cup.
— Johns. (@CricCrazyJohns) November 7, 2023
Glenn Maxwell - Australia 91/7 & then he scored 201*(128) in 2023 World Cup.
- Two ultimate knocks ever. 🐐 pic.twitter.com/thJUiC115BKapil Dev - India 17/5 & then he scored 175*(138) in 1983 World Cup.
— Johns. (@CricCrazyJohns) November 7, 2023
Glenn Maxwell - Australia 91/7 & then he scored 201*(128) in 2023 World Cup.
- Two ultimate knocks ever. 🐐 pic.twitter.com/thJUiC115B
-
Totally a one man show Maxi !! One of greatest ODI innnings of all time !! Except Kapil Dev of course !! #AUSvsAFG #Maxwell pic.twitter.com/yrhUhqXm5h
— Randeep Hooda (@RandeepHooda) November 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Totally a one man show Maxi !! One of greatest ODI innnings of all time !! Except Kapil Dev of course !! #AUSvsAFG #Maxwell pic.twitter.com/yrhUhqXm5h
— Randeep Hooda (@RandeepHooda) November 7, 2023Totally a one man show Maxi !! One of greatest ODI innnings of all time !! Except Kapil Dev of course !! #AUSvsAFG #Maxwell pic.twitter.com/yrhUhqXm5h
— Randeep Hooda (@RandeepHooda) November 7, 2023
కానీ, వచ్చిన మ్యాక్స్‌వెల్ అవకాశాల్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. అయితే ఒక దశలో మ్యాక్స్.. క్రీజులో అసౌకర్యంగా కనిపించాడు. ఫిట్నెస్ సమస్యతో పరిగెత్తలేకపోయాడు. అలాంటి స్థితిలో నొప్పిని తట్టుకొని అతడు.. మైదానం నలుమూలలా ఆడిన షాట్లు నమ్మశక్యం కావు. సింగిల్స్ తీయడం ఆపేసి, కేవలం ఫోర్లు, సిక్సర్లతోనే కొండంత లక్ష్యాన్ని కరిగించేశాడు. అలా తీవ్ర అలసటతో ఉన్నా.. క్రీజును వదలకుండా మొండిగా నిలబడ్డ తీరు వర్ణించలేనిది. అందుకే కపిల్ దేవ్ ఇన్నింగ్స్ లాగే.. మ్యాక్స్‌వెల్ ఆట చాలా ఏళ్ల పాటు క్రికెట్ చరిత్రలో నిలిచిపోతుంది.
-
Kapil Dev's 175* can finally move to the 2nd spot. Glenn Maxwell's 201* is here ❤️
— Pratham Rastogi (@Pratham_rastog) November 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
& Australia qualifies for the
semifinals🥳 #ICCCricketWorldCup #GOAT #icccricketworldcup2023 #maxwell pic.twitter.com/sNUeALfKPT
">Kapil Dev's 175* can finally move to the 2nd spot. Glenn Maxwell's 201* is here ❤️
— Pratham Rastogi (@Pratham_rastog) November 7, 2023
& Australia qualifies for the
semifinals🥳 #ICCCricketWorldCup #GOAT #icccricketworldcup2023 #maxwell pic.twitter.com/sNUeALfKPTKapil Dev's 175* can finally move to the 2nd spot. Glenn Maxwell's 201* is here ❤️
— Pratham Rastogi (@Pratham_rastog) November 7, 2023
& Australia qualifies for the
semifinals🥳 #ICCCricketWorldCup #GOAT #icccricketworldcup2023 #maxwell pic.twitter.com/sNUeALfKPT
మాక్స్వెల్ 'వన్‌మ్యాన్ షో'- డబుల్ సెంచరీతో వీరవిహారం, అఫ్గాన్‌పై ఆసీస్ విజయం