Maxwell By Runner : అఫ్గానిస్థాన్‌పై అసాధారణ ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియాను విజయతీరాలకు చేర్చాడు ఆ జట్టు ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్. అయితే సెంచరీ పూర్తైన తర్వాత ఆతడు క్రీజులో అసౌకర్యంగా కనిపించాడు. ఒక దశలో నొప్పితో బాధపడ్డాడు కూడా. మ్యాచ్ మధ్యలో పలుమార్లు ఆసీస్ జట్టు ఫిజియో గ్రౌండ్లోకి వచ్చి.. మ్యాక్స్‌వెల్‌కు చికిత్స అందించాడు. దీంతో కొద్దిగా కోలుకున్నట్లు కనిపించిన మ్యాక్స్.. సింగిల్స్ తీయడానికి ఏ మాత్రం ఇష్టపడలేదు. కేవలం ఫోర్లు, సిక్సర్లతోనే స్కోర్ బోర్డును ముందుకు నడింపించాడు. సాధారణంగా ఏ ప్లేయరైనా బ్యాటింగ్ చేస్తుండగా గాయపడితే బైరన్నర్‌ను పెట్టుకుంటారు. అయితే మంగళవారం నాటి మ్యాచ్‌లో రన్నర్ కావాలని మ్యాక్స్‌వెల్.. ఎందుకు అప్పీల్ చేయలేదంటూ క్రికెట్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి ఐసీసీ రూల్స్ ఎలా ఉన్నాయంటే..
ప్రస్తుతం ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్‌ల్లో బ్యాటర్ గాయపడితే.. రన్నర్ సహాయం తీసుకోకుండా ఐసీసీ షరతులు విధించింది. సెక్షన్ 25.5 ప్రకారం 2011 అక్టోబర్ 1న ఐసీసీ ఈ నిబంధనను అమల్లోకి తెచ్చింది. అయితే ఇది కేవలం అంతర్జాతీయ మ్యాచ్‌లకు మాత్రమేనని.. డొమెస్టిక్ లీగ్‌ల్లో, ఇతర క్రికెట్ మ్యాచ్‌ల్లో బైరన్నర్‌ను పెట్టుకునే వెసులుబాటు కల్పించింది.
గతంలో బైరన్నర్ సహాయం తీసుకున్న టీమ్ఇండియా బ్యాటర్లు.. గతంలో అన్ని దేశాల ఆటగాళ్లు.. ఆయా సందర్భాలల్లో రన్నర్‌ను పెట్టుకున్నారు. టీమ్ఇండియా బ్యాటర్ల విషయానికొస్తే.. 2003 వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్ - భారత్ మ్యాచ్‌లో వీరేందర్ సేహ్వాగ్.. సచిన్ తెందూల్కర్‌కు రన్నర్‌గా వ్యవహరించాడు. 2009 మొహాలీ టెస్ట్‌లో సురైశ్ రైనా.. వీవీఎల్ లక్ష్మణ్‌కు, 2011 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ - భారత్ మ్యాచ్‌లో సెహ్వాగ్‌కు గౌతమ్ గంభీర్ రన్నర్‌గా వ్యవహరించారు.
-
- Came to bat at 49/4
— CricTracker (@Cricketracker) November 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
- Face hat-trick ball
- Saw scoreboard go to 91/7
- Struggling with cramps
- In severe pain
- Didn't take singles after injury
- Smashed 21 fours & 10 sixes
- Registered first double century for AUS
- Won the game
- Sealed semi-final spot
Glenn Maxwell,… pic.twitter.com/DIifC14W8F
">- Came to bat at 49/4
— CricTracker (@Cricketracker) November 7, 2023
- Face hat-trick ball
- Saw scoreboard go to 91/7
- Struggling with cramps
- In severe pain
- Didn't take singles after injury
- Smashed 21 fours & 10 sixes
- Registered first double century for AUS
- Won the game
- Sealed semi-final spot
Glenn Maxwell,… pic.twitter.com/DIifC14W8F- Came to bat at 49/4
— CricTracker (@Cricketracker) November 7, 2023
- Face hat-trick ball
- Saw scoreboard go to 91/7
- Struggling with cramps
- In severe pain
- Didn't take singles after injury
- Smashed 21 fours & 10 sixes
- Registered first double century for AUS
- Won the game
- Sealed semi-final spot
Glenn Maxwell,… pic.twitter.com/DIifC14W8F
-
The pain Glenn Maxwell went through.
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
The world bows down to Maxi...!!! pic.twitter.com/klxomvZYq0
">The pain Glenn Maxwell went through.
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 7, 2023
The world bows down to Maxi...!!! pic.twitter.com/klxomvZYq0The pain Glenn Maxwell went through.
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 7, 2023
The world bows down to Maxi...!!! pic.twitter.com/klxomvZYq0
ఇక మ్యాచ్విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి అఫ్గాన్ 291 పరుగులు చేసింది. ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ (129*; 143 బంతుల్లో 8 ఫోర్లు, మూడు సిక్స్‌లు), రషీద్ ఖాన్ 35*(15 బంతుల్లో 2 ఫోర్లు) రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో హేజిల్‌వుడ్ రెండు వికెట్లు తీయగా, మిచెల్ స్టార్క్, మ్యాక్స్‌వెల్, జంపా తలో వికెట్ తీశారు. అనంతరం ఛేదనలో ఆసీస్ 91 కే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో మ్యాక్స్‌వెల్ 201* అదిరిపోయే ఇన్నింగ్స్‌తో 46.5 ఓవర్లలోనే ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చాడు.
మ్యాక్స్ మామ దెబ్బ- రికార్డులు అబ్బా, తొలి ఆసీస్ బ్యాటర్‌గా ఘనత
మాక్స్వెల్ 'వన్‌మ్యాన్ షో'- డబుల్ సెంచరీతో వీరవిహారం, అఫ్గాన్‌పై ఆసీస్ విజయం