Matt Henry Injury : ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచుల్లో మొదట వరుసగా 4 సార్లు గెలిచి.. ఆ తర్వాత వెంటవెంటనే హ్యాట్రిక్ ఓటములను మూటగట్టుకున్న న్యూజిలాండ్‌కు మరో పెద్ద షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఆ జట్టు స్టార్ బౌలర్ మ్యాట్ హెన్రీ హ్యామ్‌స్ట్రింగ్‌కు గాయపడ్డాడు. బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఇది జరిగింది. దీంతో ఓవర్ మధ్యలోనే అతడు మైదానాన్ని వీడాల్సి వచ్చింది. కానీ ఆ తర్వాత జట్టు విజయావకాశాలను కాపాడుకునేందుకు గాయం వేధిస్తున్నా మళ్లీ బ్యాటింగ్‌కు దిగాడు హెన్రీ. ఈ సమయంలో గాయం కారణంగా అతడు పడ్డ బాధ ముఖంలో స్పష్టంగా కనిపించింది. అయితే హెన్రీ గురైన గాయం తీవ్రతపై ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి స్పష్టత లేనప్పటికీ.. తదుపరి జరిగే ఒకటి లేదా రెండు మ్యాచ్‌లకు అతడు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అంశం ఆ జట్టుకు పెద్ద షాకే.
దెబ్బ మీద దెబ్బ..! అక్టోబర్ 5న ప్రారంభమైన ప్రపంచకప్‌ను డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌తో ఆడింది న్యూజిలాండ్. ఈ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఇంగ్లిష్ జట్టును ఓడించి టోర్నీలో మంచి శుభారంభం చేసింది. అలా బోణీ కొట్టి వరుసగా నాలుగు విజయాలను తన ఖాతాలో వేసుకుంది. దీంతో గ్యారెంటీ సెమిఫైనలిస్ట్గా కనిపించిన న్యూజిలాండ్‌కు గట్టి ఎదురుదెబ్బలు తగలడం ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత జరిగిన ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడి సెమీస్‌కు చేరే అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. ఇప్పటికే గాయాల కారణంగా కీలక ప్లేయర్స్ కేన్ విలియమ్సన్, లోకీ ఫెర్గూసన్, మార్క్ చాప్మన్లు ప్రపంచకప్ జట్టులో లేకపోవడం, ఈ సమయంలోనే స్టార్ బౌలర్‌గా కొనసాగుతున్న మ్యాట్ హెన్రీకి గాయం కావడం వంటి అంశాలు న్యూజిలాండ్‌కు దెబ్బ మీద దెబ్బ అనే చెప్పాలి.
-
Matt Henry will have a scan on his right hamstring tomorrow after leaving the field in Pune during his sixth over and not returning against South Africa. A further update will be provided after the scan has been assessed. #CWC23 pic.twitter.com/BbrcwHSImr
— BLACKCAPS (@BLACKCAPS) November 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Matt Henry will have a scan on his right hamstring tomorrow after leaving the field in Pune during his sixth over and not returning against South Africa. A further update will be provided after the scan has been assessed. #CWC23 pic.twitter.com/BbrcwHSImr
— BLACKCAPS (@BLACKCAPS) November 1, 2023Matt Henry will have a scan on his right hamstring tomorrow after leaving the field in Pune during his sixth over and not returning against South Africa. A further update will be provided after the scan has been assessed. #CWC23 pic.twitter.com/BbrcwHSImr
— BLACKCAPS (@BLACKCAPS) November 1, 2023
నీషమ్‌కు కూడా గాయమా..?
మరోవైపు ఇదే మ్యాచ్‌లో హెన్రీతో పాటు మరో ఆటగాడు జిమ్మీ నీషమ్ కుడా గాయపడ్డట్లు వార్తలు వస్తున్నాయి. అతడి కుడి చేతి మణికట్టుకు గాయమైనట్లు సమాచారం. ఒకవేళ ఇది కనుక నిజమే అయితే.. ఇతడు కూడా తదుపరి మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోవచ్చు. ఇది జరిగితే కివీస్ జట్టు సెమీస్ రేసులో నిలిచే అవకాశాలు దాదాపు కోల్పోయినట్లే. ఇక దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో 190 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలై ఘోర పరాజయాన్ని చవిచూసింది న్యూజిలాండ్.
శ్రీలంకతో మ్యాచ్‌లో టీమ్ఇండియా లక్ష్యం అదొక్కటే!
దక్షిణాఫ్రికా చేతిలో కివీస్ చిత్తు, సెంచరీలతో అదరగొట్టిన డీకాక్, డసెన్