టీ20 ప్రపంచకప్‌లో భాగంగా టీమ్ఇండియాతో(IND vs NZ T20 Match) తలపడేందుకు సిద్ధమవుతున్న న్యూజిలాండ్ జట్టుకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే కాలి పిక్క భాగంలో చీలిక కారణంగా జట్టుకు దూరమవుతున్నట్లు పేసర్ ఫెర్గూసన్ (Ferguson News) ప్రకటించగా.. ఇప్పుడు మరో ఆటగాడు మార్టిన్ గప్తిల్ కూడా జట్టుకు దూరం కానున్నట్లు తెలుస్తోంది.
మంగళవారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో(PAK vs NZ t20) భాగంగా హ్యారిస్ రౌఫ్ బౌలింగ్‌లో ఓపెనర్ గప్తిల్ కాలి వేలుకు గాయమైంది. దీంతో భారత్‌తో జరిగే మ్యాచ్‌లో అతడు ఆడటం అనుమానమే అని కివీస్ జట్టు ప్రధాన కోచ్ గారీ స్టెడ్ తెలిపాడు.
"కాలి వేలుకు గాయమైన కారణంగా పాక్‌తో మ్యాచ్ అనంతరం గప్తిల్ కాస్త నీరసంగా కనిపించాడు. మరో రెండు రోజుల్లో అతడి గాయం తగ్గుతుందా లేదా అనేది స్పష్టత వస్తుంది." అని స్టెడ్ పేర్కొన్నాడు.
పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందే న్యూజిలాండ్ పేసర్ ఫెర్గూసన్ టీ20 ప్రపంచకప్‌కు దూరమవుతున్నాడని న్యూజిలాండ్ క్రికెట్ వెల్లడించింది. ఇప్పుడు గప్తిల్ కూడా జట్టుకు దూరమైతే కివీస్‌పై అది తీవ్ర ప్రభావం చూపుతుంది. కాగా, అక్టోబర్ 31న టీమ్ఇండియాతో తలపడనుంది న్యూజిలాండ్.
పాక్‌దే పైచేయి..
మంగళవారం జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై అలవోకగా గెలిచి టోర్నీలో రెండో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది పాకిస్థాన్. బౌలింగ్‌తో న్యూజిలాండ్‌ను కట్టడి చేసి 134 పరుగులు స్వల్ప లక్ష్యానికే పరిమితం చేసింది. అనంతరం ఛేదనలో మహ్మద్ రిజ్వాన్(33 పరుగులు), ఆసిఫ్ అలీ(27 పరుగులు)తో రాణించి పాక్ విజయంలో కీలక పాత్ర పోషించారు.
ఇదీ చదవండి: